26న… ‘బీఫోర్ మ్యారేజ్’

34
- Advertisement -

తెలుగు తెర‌పైకి మ‌రో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ వ‌చ్చేస్తోంది. యూత్‌ను ఎట్రాక్ట్ చేసే క‌థ‌తో పాటు మెసెజ్ ఇస్తూ తెర‌కెక్కిన చిత్రం ‘బీఫోర్ మ్యారేజ్’. మూడు ద‌శాబ్దాల క్రితం సుజన ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై టార్జాన్ సుందరి, ప్రేమ ఘర్షణ, సంసార వీణా.. వంటి సినిమాలు నిర్మించిన వై నాగేశ్వర్ రెడ్డి తనయుడు ఎద్దుల జగదీశ్వర్ రెడ్డి నిర్మాతగా ప‌రిచ‌య‌మ‌వుతూ హనుమ క్రియేషన్స్ పై నిర్మిస్తున్న మూవీ బిఫోర్ మ్యారేజ్.

భరత్ – నవీన రెడ్డి హీరోహీరోయిన్లుగా శ్రీధర్ రెడ్డి ఆటాకుల దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న థియేట‌ర్‌ల‌లో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర‌యూనిట్ స‌భ్యులు హైద‌రాబాద్ ఫిలించాంబ‌ర్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించారు.

ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నిర్మాత ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. గత ఏడాది చిన్న సినిమాల హవా నడిచింది. ఈ ఏడాది ‘హనుమాన్’ చిత్రం కొన‌సాగించిన‌ ప్రభంజనం మాదిరిగానే ఈ సినిమా కూడా హిట్టవ్వాలి. ట్రైలర్ చూస్తే యూత్ కు మంచి మెసేజ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. పాటలు బాగున్నాయి. మంచి విజ‌యం సాధించాల‌ని చిత్ర‌యూనిట్‌కు విష్ చేస్తున్నాను అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న మ‌రో అతిథి నిర్మాత రామ్ సత్యనారాయణ మాట్లాడుతూ… ఈ సినిమా యూత్‌ను బాగా ఆకట్టుకుంటుంద‌ని ట్రైల‌ర్ చూస్తేనే తెలుస్తుంది. మ్యూజిక‌ల్ హిట్‌గానూ నిలుస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. లేడీ ఓరియంటేడ్ మూవీ మాదిరిగా ఉంది.. హీరోయిన్ బాగా చేసింది. ఇలాంటి సినిమాల‌ను ఆదరించాలి. చిత్ర‌యూనిట్‌కు బెస్టాఫ్ ల‌క్.

ద‌ర్శ‌కుడు శ్రీధర్ రెడ్డి ఆటాకుల మాట్లాడుతూ.. పెళ్లికి ముందు త‌ప్పు అనిపించ‌ని పొర‌పాటు.. లైఫ్‌లో ఒక్క‌సారిగా ఊహించ‌ని మార్పులు చోటు చేసుకుంటాయని, అదే విష‌యాన్ని వాస్తవానికి దగ్గరగా సినిమాను తెరకేక్కించాము. టీమ్‌లో ప్ర‌తి ఒక్క‌రూ బాగా చేశారు. ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా క్వాలిటీ విష‌యంలో నిర్మాత స‌హ‌క‌రించారు. సినిమా హిట్ట‌వుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంది.

నిర్మాత ఎద్దుల జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. చిన్న విష‌య‌మే క‌దా అని యువ‌త పెడ‌దోవ ప‌డితే ఏం జ‌రుగుతుందో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపించిన సినిమా ఇది. యదార్ధ సంఘటనల‌ ఆధారంగా ఈ సినిమాను నిర్మించాము. సినిమాలో సింగ‌ర్ మంగ్లీ పాడిన పాట భారీ హిట్ట‌వుతుంది. యువ‌తీయువ‌కుల‌కు మంచి మెసెజ్ ఇందులో ఉంటుంది. మా సినిమాను ప్రేక్ష‌కులు ఆద‌రించాల‌ని కోరుకుంటున్నామన్నారు.

Also Read:ఎసిడిటీ సమస్యా..ఇలా చేయండి!

- Advertisement -