ఈ డ్రింక్స్ తో కొలెస్ట్రాల్ కు చెక్!

49
- Advertisement -

నేటి రోజుల్లో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడం ఒక సవాల్ గా మారింది. మనం తినే ఆహారంలో ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల కొలెస్ట్రాల్ కు దారి తీస్తుంది. దాంతో విపరీతంగా బరువు పెరగడం, ఊబకాయం బారిన పడడం జరుగుతుంది. ఇక శరీరంలో కొలెస్ట్రాల్ ను తగ్గించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు చాలమంది. అయినప్పటికి సరైన ఫలితాలు మాత్రం కనిపించవు. అయితే ఆహార డైట్ విషయంలో జాగ్రత్తలు పాటించడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను సులభంగా తగ్గించవచ్చని ఫిట్నెస్ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉదయాన్నే కొన్ని రకాల పానీయాలు సేవించడం కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి దోహదం చేస్తాయట. అవేంటో తెలుసుకుందాం.

బీట్రూట్ జ్యూస్
బీట్ రూట్ లో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. అందువల్ల ఉదయాన్నే బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల శరీర భాగాలన్నిటికి రక్త ప్రసరణ సమృద్దిగా జరుగుతుంది. అంతే కాకుండా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ ను బయటకు పంపించడంలో సహాయ పడతాయి.

ఆరెంజ్ జ్యూస్
ఉదయాన్నే ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల మెదడు పనితీరు మెరుగు పడుతుంది. ముఖ్యంగా వ్యాయామానికి ముందు ఒక గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ తాగితే శరీరం ఉత్తేజానికి లోనవుతుంది. తద్వారా అలసట లేకుండా శారీరక శ్రమ చేసే వీలు ఉంటుంది. తద్వారా బాడీలోని చెడు కొలెస్ట్రాల్ వేగంగా తగ్గించుకోవచ్చు.

లెమన్ జ్యూస్
లెమన్ లో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. తద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఉదయాన్నే లెమన్ జ్యూస్ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది. ఇంకా ఎక్కువ సేపు వ్యయం చేయడానికి లెమన్ జ్యూస్ మంచి ఎనర్జీని ఇస్తుంది.

ఈ పానీయాలను ప్రతిరోజూ ఉదయం పూట వ్యాయామం సమయంలో తీసుకుంటే శరీరానికి ఎంతో మేలని ఫిట్నెస్ నిపుణులు చెబుతున్నారు.

Also Read:బీజేపీలో చేరను..తప్పుడు ప్రచారం ఆపండి

- Advertisement -