Beer:బీరు తాగితే ఎన్ని లాభాలో!

27
- Advertisement -

మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనే సంగతి అందరికీ తెలిసిందే. ఎందుకంటే మద్యపానం వల్ల లివర్, కిడ్నీల పాడవడంతో పాటు కొలెస్ట్రాల్ పెరగడం, రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగడం వంటి ఎన్నో అనారోగ్యాలు తలెత్తుతూ ఉంటాయి. తద్వారా ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. కానీ ఆల్కహాల్ మితంగా తాగితే మంచిదేనని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ముఖ్యంగా బీరు తాగితే కొన్ని రకాల ఆరోగ్య పరమైన లాభాలు కలుగుతాయని చెబుతున్నారు నిపుణులు. మద్యపానం సేవించే వారు వేసవిలో బీరు తాగడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతుంటారు. బీరు తాగడం వల్ల మూత్రపరమైన సమస్యలు తగ్గుతాయట. చాలమందికి వేసవిలో మూత్ర విసర్జన చేసేటప్పుడు మంటగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి సమస్య ఉన్నవారు బీరును మితంగా సేవిస్తే ఆ సమస్య తగ్గుతుందట. ఇంకా అల్జీమర్ వ్యాధిని తగ్గించడంలో కూడా బీరు ఎంతో ప్రయోజనకారి అని నిపుణులు చెబుతున్నారు. .

అలాగే అల్సర్, నోటిపూత వంటి సమస్యలను దూరం చేయడంలో కూడా బీరు ఎంతగానో ఉపయోగ పడుతుందట. ఇంకా బీరు సేవించే వారిలో మానసిక రుగ్మతలు తగ్గుతున్నట్లు నివేధికలు చెబుతున్నాయి. మానసిక ఒత్తిడి, ఆందోళన వంటి రుగ్మతలను దూరం చేసి మానసిక ప్రశాంతతను పెంచడంలో బీరు మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా బీరు తాగేవారిలో చర్మ సమస్యలు దూరం కావడంతో పాటు చర్మం నిగారింపును సొంతం చేసుకుంటుంది. అయితే కేవలం మితంగా సేవించినప్పుడు మాత్రమే పైన పేర్కొన్న ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు, అయితే బీరు కూడా ఆల్కహాల్ లో భాగమే కాబట్టి అతిగా సేవిస్తే లివర్ దెబ్బ తినడం, రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగడం, అధిక బరువు, బెల్లి ఫ్యాట్, గుండెల్లో మంట ఇలా చాలా సమస్యలే చుట్టుముడతాయి. కాబట్టి ఆల్కహాల్ కు వీలైనంత వరకు దూరంగా ఉండడమే మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

Also Read:కపిలేశ్వరాలయంలో వైభవంగా త్రిశూలస్నానం

- Advertisement -