ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు కావడంతో ఎంతో మంది యువతీ యువకులు లైఫ్ పాట్నర్ ను వెతుక్కునే పనిలో ఉంటారు. నచ్చిన అబ్బాయికి గాని అమ్మాయికి గాని ప్రపోజ్ చేయడం లేదా ప్రేమించిన వారితో సరదాగా సమయాన్ని గడపడం వంటి కార్యకలాపాలతో వాలెంటైన్స్ డే ను సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అయితే కొందరు వాలంటైన్స్ డే సందర్భంగా కొత్త భాగస్వామి ఎంచుకోవడానికి సిద్దమౌతుంటారు. అందుకోసం ఎక్కువమంది డేటింగ్ యాప్స్ ను ఆశ్రయిస్తుంటారు. ఈ డేటింగ్ యాప్స్ ను ఆశ్రయించే వారిని లక్ష్యంగా చేసుకొని సైబర్ నేరగాళ్ళు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే డేటింగ్ యాప్స్ ద్వారానే చాలమంది ఆన్లైన్ మోసాలకు గురౌతున్నట్లు నివేధికలు చెబుతున్నాయి.
డేటింగ్ యాప్స్ లో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి అమాయకులను నమ్మించి వారినుంచి నగదు దోచుకోవడం, లేదా వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి బ్లాక్ మెయిల్ చేయడం, న్యూడ్ ఫోటోలను సృష్టించడం.. ఇలాంటి ఎన్నో మోసాలకు పాల్పడుతుంటారు. ముఖ్యంగా వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ రకమైన మోసాలు ఎక్కువ జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి డేటింగ్ యాప్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా డేటింగ్ యాప్స్ లలో రిజిస్టర్ కాకపోవడమే మంచిదని చెబుతున్నారు. ఒకవేళ ఆల్రెడీ డేటింగ్ యాప్స్ లో రిజిస్టర్ అయినవారు. వాటిలో ఎలాంటి వ్యక్తిగత సమాచారం గాని పోటోస్ గాని పొందుపరచకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా వీలైతే డేటింగ్ యాప్స్ ను లాగ్ ఔట్ చేసి వాటిని మొబైల్ నుంచి రిమూవ్ చేయాలి. ఎట్టి పరిస్థితిల్లోనూ వాట్సప్ ద్వారా షేర్ అయే డేటింగ్ యాప్స్ లింక్స్ ను అసలు ఓపెన్ చేయకూడని చెబుతున్నారు టెక్ నిపుణులు. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల సైబర్ మోసాల భారీ నుంచి తప్పించుకోవచ్చు.
Also Read:పనస పండ్లు ఎక్కువగా తింటున్నారా?