సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే పిచ్చి యువతను ప్రమాదకర పనుల వైపు నెట్టేస్తోంది. తాజాగా ఓ యువకుడు రైలు వెళ్తున్న పట్టాలపై పడుకుని వీడియో తీయించుకోవడం కలకలం రేపింది. క్షణకాలం కూడా ఆలోచించకుండా చేసిన ఈ నిర్వాకం ప్రాణాలకు తీవ్ర ముప్పుగా మారింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను హైదరాబాద్ సీపీ సజ్జనార్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఇలాంటి పనులు ఎంతటి ప్రమాదకరమో హెచ్చరిస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. “ఇది మూర్ఖత్వం పరాకాష్టకు చేరిన ఉదాహరణ. ఒక్క సెకను తేడా జరిగినా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి” అంటూ తీవ్రంగా హెచ్చరించారు.
లైక్స్, వ్యూస్ కోసం ప్రాణాలతో చెలగాటం ఆడటం ఏమాత్రం సమంజసం కాదని ఆయన స్పష్టం చేశారు. యువత ఇలాంటి స్టంట్స్‌కు దూరంగా ఉండాలని, సోషల్ మీడియా కోసం జీవితాన్ని పణంగా పెట్టవద్దని సీపీ సజ్జనార్ సూచించారు. పోలీసులు కూడా ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
Also Read:ఐసీసీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాం: బీసీసీఐ
వైరల్ పిచ్చితో ఇలాంటి పనులు చేయడం సాహసం కాదు.. అది పరాకాష్టకు చేరిన మూర్ఖత్వం. ఒక్క సెకను తేడా జరిగినా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి.
Be Responsible, Not Reckless!#LifeIsPrecious #DontRiskYourLife pic.twitter.com/5GBZ2BdTcn
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) February 3, 2026

