ఆటో డెబిట్ ఆప్షన్ తో..కేర్ ఫుల్!

41
- Advertisement -

ఆటో బెడిట్ ఆప్షన్ గురించి మనందరికి తెలిసే ఉంటుంది. ఏదైనా యాప్ ప్లే స్టోర్ నుంచి కొనుక్కోవాలన్న లేదా నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ వంటి ఓటిటీ ప్లాట్ ఫామ్స్ లో సబ్స్ క్రిప్షన్ తీసుకోవలన్న మొబైల్ ద్వారా ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ ఉపయోగించి చేస్తుంటాము. అయితే అలాంటి సందర్భంలో ఆటో డెబిట్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. ఫలితంగా సబ్స్ క్రిప్షన్ టైమ్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్ గా బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అవుతుంటాయి. దీంతో అమౌంట్ ఎలా కట్ అయిందనే దానిపై తలపట్టుకుంటూ ఉంటాము. దీనికి కారణం సబ్స్ క్రిప్షన్ లో ఆటో డెబిట్ ఆప్షన్ ఉండడమే. ఈ ఆప్షన్ ఆన్ లో ఉండడం వల్ల మనం వాటిని ఉపయోగించిన లేదా ఉపయోగించకపోయిన డబ్బు బ్యాంక్ నుంచి కట్ అవుతునే ఉంటుంది..

అందువల్ల ఆటో డెబిట్ ఆప్షన్ ను ఆఫ్ చేసుకోవడం ఎంతో ముఖ్యం. అయితే దీనిని ఎలా ఆఫ్ చేసుకోవాలి అనే విషయం చాలమందికి తెలియదు. .కాబట్టి ఆటో డెబిట్ ఆప్షన్ ఎలా ఆఫ్ చేయాలో తెలుసుకుందాం. సంబంధిత యాప్ కు పేమెంట్ చెల్లించే క్రమంలో ఎట్టి పరిస్థితుల్లో ఆటో డెబిట్ ఆప్షన్ సెలెక్ట్ చేయకూడదు. ఇంకా సంబంధిత యాప్ ను ఆన్ ఇన్స్టాల్ చేసిన తరువాత మొబైల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళాలి అక్కడ ఫ్రొఫైల్ ను సెలక్ట్ చేయాలి. తరువాత పేమెంట్ అండ్ సప్స్ క్రిప్షన్ ఆప్షన్ ను ఎంచుకోవాలి. ఆ తరువాత అందులో సబ్స్ క్రిప్షన్ ను ఎంచుకోవాలి. అక్కడ మనం ఏ ఏ యాప్స్ లో సబ్స్క్రిప్షన్ తీసుకున్నామో చూపిస్తుంది. అప్పుడు మనం వాడని యాప్స్ కు ఆన్ సబ్స్ క్రైబ్ చేసి రిమూవ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మనం యూస్ చేయని యాప్స్ కు అనవసరంగా పేమెంట్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఏదైనా యాప్స్ లో సబ్స్ క్రిప్షన్ తీసుకునే టైమ్ లో పైన చెప్పిన సూచనలు కచ్చితంగా పాటించాలని టెక్ నిపుణులు చెబుతున్నారు.

Also Read:కోకాపేట భూముల వేలం..ఎకరా 100 కోట్లు

- Advertisement -