వాకింగ్ చేసేటప్పుడు.. జాగ్రత్త!

23
- Advertisement -

ప్రతిరోజూ ఉదయాన్నే వాకింగ్ చేయడం ఎంతో మేలని ఫిట్నెస్ నిపుణులు చెబుతుంటారు. ఎందుకంటే వాకింగ్ చేయడం వల్ల శరీర భాగాలన్నింటికీ రక్తప్రసరణ జరుగుతుంది. ఇంకా బరువు తగ్గడానికి కూడా వీలుంటుంది. ప్రతిరోజూ ఒక అరగంట వాకింగ్ చేయడానికి కేటాయిస్తే రోజంతా యాక్టివ్ గా ఉంటారని ఫిట్నెస్ నిపుణులు చెబుతున్నారు. అయితే వాకింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. లేదనే కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి వాకింగ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం !

* వాకింగ్ చేసేటప్పుడు షూ లేకుండా పాదాలపై చేయడం ఉత్తమం అంటున్నారు ఫిట్నెస్ నిపుణులు. ఎందుకంటే పాదాలు శక్తినొండడంతో పాటు రక్తప్రసరణ సరిగా జరుగుతుంది. .
* ఒకవేళ షూ వేసుకునే అలవాటు ఉంటే అవి సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవాలి. వాకింగ్ చేసేటప్పుడు మొబైల్ చూడడం ఏ మాత్రం మంచిది కాదు. మొబైల్ చూడటం వల్ల ఏకాగ్రత దెబ్బ తింటుంది.
* ఆయాసం, శ్వాస సంబంధిత వ్యాధులు ఉన్నవారు వేగంగా వాకింగ్ చేయకుండా ప్రతి 5-10 నిమిషాల వ్యవధిలో కాస్త విరామం తీసుకుంటూ వాకింగ్ చేయాలి.
*వాకింగ్ చేయునప్పుడు చేతులను అపసవ్య దిశలో కదిలించరాదు. అలా చేయడం వల్ల కండరాల నొప్పి కలిగే అవకాశం ఉంది.
* నడిచేటప్పుడు వంగి నడవడం గాని, ముందుకు వెనక్కి కదులుతూ వాకింగ్ చేయడం గాని చేయరాదు. వెన్నెముక నిటారుగా ఉంచి వాకింగ్ చేయాలి.
* ముఖ్యంగా వాకింగ్ చేసేటప్పుడు చెమట అధికంగా వస్తుంది. తద్వారా డిహైడ్రేట్ బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి మధ్యలో కాస్త నీరు తాగుతూ శరీరం హైడ్రేట్ గా ఉండేలా చూసుకోవాలి.

Also Read:శ్రీ రామ జన్మభూమి మందిర్ విశేషాలు..

- Advertisement -