- Advertisement -
దక్షిణ ఒడిశా- ఉత్తరాంద్ర పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం ఈ రోజు తీవ్ర అల్పపీడనంగా బలపడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ తీవ్ర అల్పపీడనం ఒడిశా తీర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉందన్నారు. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉందన్నారు వాతావరణ సంచాలకురాలు నాగరత్న. దీన్ని ప్రభావంతో రాష్ట్రంలో ఈ రోజు అత్యంత భారీ వర్షాలు, రానున్న రెండు రోజుల అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరింది.
- Advertisement -