బీసీసీఐకి షాక్‌..డీసీకి రూ.4800 కోట్లు చెల్లించాల్సిందే!

355
deccan chargers
- Advertisement -

బీసీసీకి గట్టి షాక్ తగిలింది. డక్కన్ ఛార్జర్స్‌ను ఐపీఎల్‌ నుండి తొలగించినందుకు నష్టపరిహారంగా రూ. 800 కోట్లు చెల్లించాలని సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్ సీకే టక్కర్‌ తెలిపారు.ఐపీఎల్ నుండి తమను తప్పించడంపై దక్కన్‌ క్రానికల్‌ హోల్డింగ్స్‌ (డీసీహెచ్‌ఎల్‌) బాంబే హైకోర్టును ఆశ్రయించింది. దీంతో బాంబే హైకోర్టు 2012 సెప్టెంబర్‌లో సుప్రీం కోర్టు మాజీ జడ్జీ సీకే టక్కర్‌ను ఈ కేసులో మధ్యవర్తిగా నియమించింది.

సరైన కారణాలు చూపించకుండా దక్కన్‌ చార్జర్స్‌ను అన్యాయంగా లీగ్‌ నుంచి తప్పించినందుకు పరిహారంగా ఈ ఏడాది సెప్టెంబర్‌లోగా డీసీకి రూ.4800 కోట్లు చెల్లించాల్సించాలని టక్కర్‌ బీసీసీఐకి ఆదేశాలు జారీచేశారు.

బీసీసీఐకి రూ.100 కోట్లు నేషనల్ బ్యాంక్‌ నుంచి పూచీకత్తుగా ఇవ్వడంలో విఫలమైంది డక్కన్ ఛార్జర్స్. దీంతో.. 2012లో డెక్కన్ ఛార్జర్స్ టీమ్‌ని ఐపీఎల్ టోర్నీనుంచి తొల‌గించింది బీసీసీఐ.. ఆ వెంటనే బిడ్స్‌ని ఆహ్వానించగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎంట్రీ ఇచ్చింది.

- Advertisement -