ఐపీఎల్ 14.. బీసీసీఐ సంచలన నిర్ణయం..

185
- Advertisement -

ఇంగ్లండ్‌తో టీమిండియా వరుస సిరీస్‌లు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఇరు జట్ల మద్య వన్డే సిరిస్‌ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంగ్లాడ్‌తో జరుగుతున్న సిరీస్‌లో ఆటగాళ్లు అవుటా? నాటవుటా? అన్న విషయంలో థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదం కావడం, అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ పై చర్చ సాగుతుండటంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.

వచ్చే నెల 9 నుంచి జరగనున్న ఐపీఎల్‌లో ఫీల్డ్‌లో ఉండే అంపైర్ సాఫ్ట్ సిగ్నల్‌ను పరిగణనలోకి తీసుకోరాదని పేర్కొంది. ఐపీఎల్ నిబంధనల్లోని అపెండిక్స్ డీ-క్లాస్ 2.2.2 ప్రకారం చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. కాగా, ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టీ-20 సిరీస్‌లో సూర్యకుమార్ ఇచ్చిన క్యాచ్‌ని ఇంగ్లండ్ అటగాడు డేవిడ్ మలాన్ డైవ్ చేస్తూ పట్టుకోగా, ఆ బంతి నేలను తాకినట్టు స్పష్టంగా కనిపించింది.

అయితే, గ్రౌండ్‌లో ఉన్న అంపైర్ సాఫ్ట్ సిగ్నల్‌గా అవుట్ ను ప్రకటించడంతో రిస్క్ తీసుకునేందుకు ఇష్టపడని థర్డ్ అంపైర్ దాన్ని అవుట్‌గా ప్రకటించాడు. ఈ విషయంలో తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో వచ్చే ఐపీఎల్‌లో ఇటువంటి తప్పులు చోటు చేసుకోకుండా చూడాలని భావించిన బీసీసీఐ, ఫీల్డ్ అంపైర్‌తో సంబంధం లేకుండా, తనకు రిఫర్ చేసిన బాల్స్‌లో థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని సమీక్షించే అవకాశం లభించనుంది.

- Advertisement -