తనపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) విధించిన జీవితకాల నిషేధాన్ని ఎత్తివేయాలంటూ అవిశ్రాంతంగా పోరాడుతున్న క్రికెటర్ శ్రీశాంత్ కు ఎట్టకేలకు భారీ ఊరట లభించింది. శ్రీశాంత్ పై బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని ఎత్తివేస్తూ సోమవారం కేరళ హైకోర్టు తీర్పునిచ్చింది.
గతేడాది ఢిల్లీలోని ఓ కోర్టు కూడా స్పాట్‌ఫిక్సింగ్ కేసులో శ్రీశాంత్‌ను నిర్దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పు తర్వాత తనపై ఉన్న నిషేధాన్ని ఎత్తేయాలని శ్రీశాంత్ బీసీసీఐని కోరినా.. బోర్డు తిరస్కరించింది. దీంతో అతను కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. కోర్టు క్లీన్‌చిట్ ఇచ్చినా.. బోర్డు తనను కావాలని వేధిస్తున్నదని పిటిషన్ వేశాడు. అతను నిర్దోషిగా తేలినా బోర్డు ఎలా నిషేధిస్తుంది? సహజ న్యాయాన్ని తిరస్కరించడమే అవుతుందని తీర్పు సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది.
హైకోర్టు తీర్పు తర్వాత శ్రీశాంత్ ట్విట్టర్‌లో ఆనందం వ్యక్తంచేశాడు. గాడ్ ఈజ్ గ్రేట్ అంటూ ట్వీట్ చేసిన శ్రీశాంత్…తనకు మద్దతిచ్చిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు.
God is great..thanks for the all the love and support pic.twitter.com/THyjfbBSFv
— Sreesanth (@sreesanth36) August 7, 2017