BCCI:ఆ ఇద్దరి రిటైర్మెంట్‌పై శుక్లా!

8
- Advertisement -

కొంతకాలంగా టీమిండియా ఆటగాళ్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ రిటైర్‌మెంట్ రకరకాల ఉహాగానాలు జోరందుకున్న సంగతి తెలిసిందే. ఇప్ప‌టికే వీరిద్ద‌రు టెస్టులు, టీ20ల‌కు వీడ్కోలు ప‌లికిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేపథ్యంలో రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్‌పై స్పందించారు బీసీసీఐ ఉపాధ్య‌క్షుడు రాజీవ్ శుక్లా. అవ‌న్నీ వ‌ట్టి పుకార్లేన‌ని …. అస‌లు ఇలాంటివి ఎలా పుట్టుకొస్తాయో అర్థంకావ‌డం లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు.

ఆసీస్‌తో సిరీసే ఎందుకు వీడ్కోలు అవుతుంది? వారి రిటైర్‌మెంట్ గురించి మీరంతా ఎందుకు ఆందోళ‌న చెందుతున్నారు? బీసీసీఐ ఎవ‌రిని కూడా రిటైర్‌మెంట్ క‌మ్మ‌ని చెప్ప‌దు…. ఆట‌గాడు స్వ‌త‌హాగా నిర్ణ‌యం తీసుకుంటాడు. ప్లేయ‌ర్ తీసుకునే నిర్ణ‌యాన్ని ఎవరైనా గౌర‌వించాల్సిందే అని శుక్లా చెప్పుకొచ్చారు.

అక్టోబ‌ర్‌లో భార‌త జ‌ట్టు ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఆతిథ్య ఆస్ట్రేలియాతో భార‌త్ మూడు వ‌న్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడ‌నుంది. వ‌న్డే సిరీస్ అక్టోబ‌ర్ 19 నుంచి ప్రారంభం కానుంది.

Also Read:మంత్రి రాసలీలలు..భూమన సంచలన వ్యాఖ్యలు

- Advertisement -