బంగ్లా వివాదం..కేకేఆర్‌కు బీసీసీఐ ఆదేశాలు

6
- Advertisement -

ఐపీఎల్ 2026 సీజన్ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టులో ఎంపికైన బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రహ్మాన్‌ను విడుదల చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కేకేఆర్‌కు ఆదేశించింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అధికారికంగా ధృవీకరించారు. ముస్తాఫిజుర్ స్థానంలో మరో ఆటగాడిని తీసుకునేందుకు కేకేఆర్‌కు అనుమతి కూడా ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.

ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ఏర్పడిన ఆగ్రహం తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. గత నెల జరిగిన ఐపీఎల్ వేలంలో కేకేఆర్, ఎడమచేతి ఫాస్ట్ బౌలర్ అయిన ముస్తాఫిజుర్ రహ్మాన్‌ను రూ. 9.2 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ వేలంలో ఎంపికైన ఏకైక బంగ్లాదేశ్ ఆటగాడు కూడా ఆయనే కావడం గమనార్హం.

ఈ విషయంపై దేవజిత్ సైకియా మాట్లాడుతూ..ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో బీసీసీఐ, కేకేఆర్‌ను బంగ్లాదేశ్‌కు చెందిన ముస్తాఫిజుర్ రహ్మాన్‌ను జట్టు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. అలాగే, కేకేఆర్ ఎవరైనా ప్రత్యామ్నాయ ఆటగాడిని కోరితే, బీసీసీఐ ఆ అనుమతిని కూడా ఇస్తుంది అని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది.

Also Read:మహారాష్ట్ర గ్రీన్ విప్లవానికి GIC తోడ్పాటు

 

- Advertisement -