BCCI:కోచ్ పదవికి దరఖాస్తుల ఆహ్వానం

30
- Advertisement -

టీ20 ప్రపంచకప్‌తో కోచ్ రాహుల్ ద్రావిడ్ పదవీకాలం ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా ప్రధాన కోచ్ పదవి కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. రానున్న మూడున్నరేండ్లకు కోచ్‌ కోసం బీసీసీఐ కొత్తగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 27 ఆఖరి తేదీగా ప్రకటించింది.

చీఫ్‌ కోచ్‌ ఎంపిక ప్రక్రియలో దరఖాస్తులను పూర్తిగా పరిశీలిస్తాం…. ఆ తర్వాత వ్యక్తిగత ఇంటర్వ్యూలు చేసి తుది జాబితాను వెల్లడిస్తాం అని బీసీసీఐ వెల్లడించింది. 60 ఏండ్ల లోపు ఉండి జాతీయ జట్టు తరఫున 30 టెస్టులు లేదా 50 వన్డేలు, రెండేండ్ల పాటు కోచ్‌గా అనుభవం ఉన్న వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా బోర్డు పేర్కొంది. పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని బోర్డు సభ్యులు భావిస్తున్నారు.

Also Read:KTR:అచ్చంపేట ఘటనపై రాహుల్‌కి ట్వీట్

- Advertisement -