ఆటగాళ్ల జీతాలపై బీసీసీఐ ప్రకటన..!

340
bcci
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలమైంది. అత్యవసర సేవలు, నిత్యావసరాలు మినహా అన్నీ మూతపడ్డాయి. కరోనా ప్రత్యక్షంగా, పరోక్షంగా అన్నిరంగాలపై ప్రభావం చూపింది.

ఇక కరోనాతో క్రికెట్ కూడా బంద్ అయిన సంగతి తెలిసిందే. కరోనా వల్ల కలిగే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి వివిధ జట్ల పాలక మండళ్ళు జీతాల తగ్గింపులను మరియు తొలగింపులను ప్రకటించాయి.

అయితే బీసీసీఐ మాత్రం ఆటగాళ్ల జీతాల్లో ఎలాంటి కోతలు లేవని ప్రకటించింది. ఎవరికి ఇప్పటి వరకు పే కట్ లేదా లే-ఆఫ్ లేదు. ప్రయాణం, ఆతిథ్యం మొదలైన ఇతర రంగాల్లో ఖర్చు తగ్గించుకున్నాం అంతే అని బీసీసీఐ అధికారులు తెలిపారు.

అయితే ఇప్పటికే వెస్టిండీస్ ఆరు నెలల వరకు ఆటగాళ్ల జీతాల్లో సగం కోత విధించగా ఆస్ట్రేలియా, పాకిస్తాన్ బోర్డులు ఆటగాళ్ళు మరియు పనిచేసే సిబ్బందికి వేతన కోతలను ప్రకటించిన సంగతి తెలిసిందే.

- Advertisement -