MLC Kavitha:ఇందిరా పార్క్ వ‌ద్ద బీసీ మ‌హాస‌భ

2
- Advertisement -

రేపు హైదరాబాద్ పార్క్ వద్ద బీసీ మహాసభ జరగనుందని తెలిపారు ఎమ్మెల్సీ కవిత. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన కవిత…కామారెడ్డి డిక్లరేషన్ అమలుతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలన్న డిమాండ్‌తో సావిత్రీ బాయి పూలే జయంతిని పురస్కరిం చుకొని ఈ నెల 3వ తేదీన ఇందిరా పార్కు బీసీ మహాసభ నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఎన్నిక‌ల స‌మ‌యంలో బీసీల‌కు హామీలిచ్చి.. అధికారంలోకి వ‌చ్చాక వారికి కాంగ్రెస్ ప్ర‌భుత్వం వెన్నుపోటు పొడిచింద‌ని క‌విత ధ్వ‌జ‌మెత్తారు. కామారెడ్డి డిక్ల‌రేష‌న్ అమ‌లు, స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు ఇప్పుడు అట‌కెక్కాయ‌ని విమ‌ర్శించారు.

 

Also Read:భవిష్యత్‌లో అమరావతికి సినిమా రంగం

- Advertisement -