KTR:బీసీ డిక్లరేషన్ బోగస్

3
- Advertisement -

బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు బలమైన వెన్నుపోటు పొడిచిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హనుమకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. బీసీ డిక్లరేషన్ ఇచ్చి ఒక్క సంవత్సరం పూర్తయిన ఇప్పటిదాకా ఒక్క అడుగు ముందుకు పడలేదు అన్నారు. బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందిందని… హామీలు ఇచ్చి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేసిన రేవంత్, బీసీ బిడ్డలకు క్షమాపణలు చెప్పాలన్నారు.

బీసీ కుల గణన చేయాల్సిందే, 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చినంకనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించాలన్నారు. ప్రభుత్వం పైన నమ్మకం లేకనే కులగణనకు వెళ్లిన అధికారులను ప్రజలు ప్రశ్నిస్తున్నారు … ఇచ్చిన హామీలను రేవంత్ ఎందుకు అమలు చేయడం లేదంటూ ఇంటికి వచ్చిన ప్రభుత్వాధికారులను ప్రశ్నించాలన్నారు. ప్రభుత్వ విధానాల పైన ప్రజలకు ప్రశ్నించే హక్కు ఉంటుందని…ప్రజలను ఒప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు.

60 ఏళ్ల పాటు బీసీలకు అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్… 60 ఏళ్లలో కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు చేయలేని దరిద్రపు చరిత్ర కాంగ్రెస్‌ది అన్నారు. కాంగ్రెస్ ఏడాది వైఫల్యాల పైన మేము కూడా వారోత్సవాలు నిర్వహిస్తాం… రేవంత్ రెడ్డి మహారాష్ట్ర వెళ్లి అబద్ధాలు, హౌల మాటలు మాట్లాడుతున్నాడన్నారు. ఎవని అయ్యా సొమ్ము అని అబద్ధాలతో ఫుల్ పేజీ యాడ్లు వేస్తున్నాడు… సరిగ్గా సంవత్సరం కింద ఇదే రోజు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ బీసీలకు అనేక హామీలు ఇచ్చిందన్నారు.

Also Read:Bigg Boss 8 Telugu: హరితేజ ఎలిమినేట్

- Advertisement -