జమ్మి చెట్లను నాటిన రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్..

168
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఊరు ఊరికో జమ్మి చెట్టు..గుడి గుడికో జమ్మి చెట్టు కార్యక్రమంలో భాగంగా నేడు గొట్టిపర్తి గ్రామం, తుంగతుర్తి మండలం,సూర్యపేట జిల్లాలో రాష్ట్ర బిసి కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్ జమ్మి చెట్లను గ్రామ ప్రజలతో కలిసి నాటారు.

ఈ సందర్భంగా రాష్ట్ర బిసి కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్ మాట్లాడుతు.. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఊరు ఉరికో జమ్మిచెట్టు, గుడి గుడికో జమ్మిచెట్టు అనే అద్భుతమైన కార్యక్రమం చేపట్టారు అని అన్నారు.దసరా పండుగ సందర్భంగా జమ్మి చెట్టుకు పూజలు చేయడం మన తెలంగాణ రాష్ట్ర సాంప్రదాయమని ప్రతి ఒక్కరూ ఇదే విధంగా ప్రతి గుడిలో, ప్రతి ఊరిలో జమ్మి మొక్కను నాటాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చందా వెంకన్న, MPTC కేతిరెడ్డి లతా విజయ్ కుమార్ రెడ్డి, గ్రామ నాయకులు తాళ్లపల్లి యాదగిరి గౌడ్, బర్ల సోమన్న, కోతి యాకన్న, తాళ్లపల్లి యాకయ్య, అన్నెబోయిన యాకన్న, మహేష్,బాలగాని ప్రవీణ్, నాళి మురళి, అన్నెబోయిన ఉపేందర్, ఎల్లేష్, సురేష్, అశోక్, మహంకాళి వెంకన్న, సాయిలు, శ్రీకాంత్, సతీష్ శర్మ, శీను గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -