టీఆర్‌ఎస్‌ అభ్యర్థి భగత్‌కు బీసీ కుల సంఘాల మద్దతు..

221
- Advertisement -

నాగార్జునసాగర్‌లో బీసీ అభ్యర్థి నోముల భగత్ కు 14 బీసీ కులాలు,  47బీసీ కుల సంఘాలు మద్దతు ప్రకటిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య తెలిపారు. హైదరాబాద్ కాచిగూడలో నిర్వహించిన సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ కృష్ణ, సంగెం సూర్యారావు,నడికూడ జయంత్ రావు,నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు నీలా వెంకటేష్,మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలలో టీఆర్ఎస్‌కు చెందిన బీసీ అభ్యర్థి నోముల భగత్ పోటీ చేస్తున్నందున 14 బీసీ సంఘాలు 47 బీసీ కుల సంఘాలు బీసీ అభ్యర్థిని జనరల్ స్థానంలో గెలిపించుకోవాలని ఉద్దేశంతో మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. అన్ని బీసీ కులాలు, సంఘాల నాయకులు సమావేశమై చర్చించి బీసీ అభ్యర్థి అయిన నోముల భగత్‌ను గెలిపించుకోవాలని నిర్ణయించినట్లు అందుకు ప్రతి ఒక్క బీసీ ఛాలెంజ్‌గా తీసుకొని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉందని అన్నారు.

- Advertisement -