BB9:మహారాజుగా నిఖిల్

9
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9 తెలుగు విజయవంతంగా 66 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా మహారాజు-మహారాణులు పేరిట బిగ్ బాస్ ఆటలాడించారు. మహారాణి-మహారాజు అంటూ డ్యూటీ ఎక్కగానే దంచుడు మొదలుపెట్టేశారు దివ్య-కళ్యాణ్-రీతూ. ముఖ్యంగా ప్రజలుగా ఉన్న ఇమ్మానుయేల్, భరణి, గౌరవ్, సుమన్ శెట్టిని మరీ దారుణంగా హింసించినట్లు ప్రవర్తిస్తున్నారు.

మార్నింగ్ తనూజ వేసిన డైలాగ్స్‌కి రీతూ-కళ్యాణ్-దివ్య రివెంజ్ ప్లాన్ చేశారు. కిచెన్ దగ్గరికొచ్చి కమాండర్ తనూజని దీనిపై కూర్చోబెట్టండి.. అంటూ డీమాన్-నిఖిల్‌లకి చెప్పారు. దీంతో తనూజని ముందుగు నడు అన్నటలు డీమాన్ భుజం మీద టచ్ చేశాడు. దీనికి చెయ్యి వేస్తున్నావేంట్రా.. నో ఉమెన్ హ్యాండ్‌లింగ్.. ఏయ్ మ్యాన్ హ్యాండ్లింగ్ ఏంటి.. అంటూ తనూజ అడిగింది.

ఆ తర్వాత ప్రజలకి మరోసారి కమాండర్లు అయ్యేందుకు బిగ్‌బాస్ అవకాశం కల్పించాడు. ఇందులో భాగంగా ప్రజల నుంచి ఇద్దరు.. కమాండర్ల నుంచి వచ్చే ఇద్దరితో టీమ్‌గా పోటీ పడాల్సి ఉంటుంది. ఇక ఆ పోటీపడే ఇద్దరు కమాండర్లు ఎవరనేది రాజు-రాణులు డిసైడ్ చేయాలని బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో నిఖిల్-డీమాన్ ఇద్దరినీ సెలక్ట్ చేశారు. ఇక వీరు గేమ్ ఆడేందుకు ప్రజల నుంచి గౌరవ్-భరణిని సెలక్ట్ చేసుకున్నారు.ఈ రెండు టీమ్స్ మధ్య ‘నిలబెట్టు పడగొట్టు’ అనే టాస్క్ పెట్టాడు బిగ్‌బాస్. ఈ టాస్కులో డీమాన్-నిఖిల్ గెలిచారు.

ఈ టాస్కులో ఓడిపోయిన ప్రజలకి ఇక కమాండర్ అయ్యే అవకాశాలన్నీ అయిపోయాయి. అలానే ఈ వారం ఇమ్యూనిటీకి కూడా వీళ్లు దూరమయ్యారు. కాసేపటి తర్వాత బిగ్‌బాస్ మరో ట్విస్ట్ ఇచ్చాడు. ఈసారి మహారాజు-రాణులు తమ స్థానాన్ని కాపాడుకోవడానికి ఒక టాస్క్ ఆడాల్సి ఉంటుంది. దీని కోసం మీ ముగ్గురిలో ఎవరు రిస్క్ చేసి ఆడతారు అనేది డిస్కస్ చేసి చెప్పమని బిగ్‌బాస్ కోరాడు. దీంతో రీతూ-కళ్యాణ్-దివ్య ఎవరు టాస్క్ ఆడాలి అనే దానిపై చర్చించుకున్నారు.

ఎయిమ్ ఫర్ క్రౌన్ అంటూ పెట్టిన ఈ టాస్కులో కమాండర్స్ నిఖిల్-డీమాన్ నుంచి ఒకరిని సెలక్ట్ చేసుకోవాలంటూ బిగ్‌బాస్ దివ్యకి చెప్పాడు. దీంతో దివ్య.. నిఖిల్‌ని సెలక్ట్ చేసుకుంది.ఇక ఈ గేమ్‌లో నిఖిల్ గెలిచి మహారాజుగా ప్రమోట్ అయ్యాడు.

- Advertisement -