BB9:ఫస్ట్ ఫైనలిస్ట్‌గా కళ్యాణ్!

7
- Advertisement -

సామాన్యుడిగా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన తెలుగు కుర్రాడు కళ్యాణ్ పడాల ఇప్పుడు సీజన్ 9లో తన దూకుడు చూపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఫస్ట్ ఫైనలిస్ట్ టాస్క్‌లు గత వారం నుంచి తీవ్ర రసవత్తరంగా సాగుతుండగా, ప్రతి టాస్క్‌ను యుద్ధరంగంలా మార్చిన కళ్యాణ్ తన దూకుడుతో ప్రత్యర్థులను ఒత్తిడిలో పెట్టాడు.

కెప్టెన్సీ రేస్‌లో డెమాన్ పవన్‌ని మట్టికరిపిస్తూ చివరి కెప్టెన్‌గా నిలిచిన కళ్యాణ్, అదే వేగంతో టికెట్ టు ఫినాలే టాస్కుల్లోనూ మెరిసి, ఫస్ట్ ఫైనలిస్ట్‌గా ఎదిగాడన్న వార్తలు హౌస్‌లో హాట్‌టాపిక్‌గా మారాయి. చివరి వారాల్లో వచ్చిన ఈ విజయాలు అతన్ని టైటిల్‌కు మరింత చేరువ చేసినట్టే.

ఈ రేస్ మొత్తం జిమ్మిక్కులు, గ్రూప్ ప్లానింగ్‌లతో నిండిపోయింది. డెమాన్ పవన్ “ఫస్ట్ ఫైనలిస్ట్ నేనే” అంటూ ధీమాగా తొడకొట్టినా, భరణి చేతిలో వరుసగా రెండు సార్లు ఓడి రేస్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. మొదట భరణి దూకుడు టాప్‌లో ఉన్నట్టే అనిపించగా, కళ్యాణ్, ఇమ్మానుయేల్, రీతూ ప్లానింగ్‌తో అతని రేసుకే బ్రేక్ పడింది.

కళ్యాణ్–ఇమ్మానుయేల్ కావాలనే రీతూకి ఓడిపోవడంతో, రీతూ భరణిని నాకౌట్ కోసం సెలెక్ట్ చేసింది. డెమాన్ పవన్‌ని ఓడించిన భరణి, రీతూతో ఆడే సమయానికి మాత్రం భయంతో కన్‌ఫ్యూజ్ అయ్యాడు. రింగ్ టాస్క్‌లో రీతూ అద్భుతంగా ఆడటంతో భరణి ఓడిపోయి రేస్ నుంచి నిష్క్రమించాడు.

సంజన రీతూకే సపోర్ట్ చేయగా, తనూజ–సుమన్ శెట్టి మాత్రం చివరి వరకూ భరణికి మద్దతిచ్చారు. అయితే ఈ రేస్ ముగిసే సమయానికి ఇమ్మానుయేల్, రీతూ, కళ్యాణ్ మాత్రమే మిగిలి, చివరికి ఎక్కువ టాస్క్‌ల్లో గెలిచిన కళ్యాణ్ పడాలే బిగ్ బాస్ సీజన్ 9 ఫస్ట్ ఫైనలిస్ట్‌గా నిలిచాడు.

Also Read:ఓటీటీలోకి మిషన్ ఇంపాజిబుల్!

- Advertisement -