BB9:తనూజ వర్సెస్ మాధురి

5
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9 తెలుగు విజయవంతంగా 53 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా అందరూ గార్డెన్ ఏరియాలో కూర్చోగా పక్కనే ఉన్న సంజని రాత్రి తనూజతో జరిగిన గొడవ గురించి మాధురి చెప్పింది. నాకు నిన్న కోపానికి బీపీ వెళ్లిపోయింది పైవరకూ.. ఎందుకులే గొడవని పడుకుండిపోయాను.. అని మాధురి అంది. ఇంతలో మార్నింగ్ తినడానికి ఏం చేస్తున్నారు అంటూ తనూజ వచ్చింది. అది మీరే చెప్పాలి అంటూ మాధురి అంది.

ఫుడ్ విషయంలో కూడా దెబ్బలాడితే మా ఇంట్లో వాళ్లు చూస్తే హర్ట్ అవుతారు ఇంక ఆకలికి చస్తుంది ఏడుస్తుందని.. మధ్యాహ్నం అన్నం తినకే కదా నీతో ఒక చపాతీ ఎక్స్‌ట్రా అడిగాను.. అంటూ మాధురి ఎమోషనల్ అయింది. దీంతో ఏం తెలీనట్లు దివ్యని పిలిచి ఆవిడ ఎక్స్‌ట్రా చపాతీ అడిగితే ఇవ్వలేదా అంటూ తనూజ అడిగింది. మాధురి గురించి చాడీలు చెప్పడంతో అందరికీ వంట చేసేసి మళ్లీ గార్డెన్ ఏరియా దగ్గరికొచ్చి కూర్చుంది మాధురి.

ఫుడ్ మీద కోపం ఎందుకు అంటూ సంజన ప్లేట్ పట్టుకొని వచ్చింది. ఊరికే తినను అంతే నువ్వు నాకు నిజమైన ఫ్రెండ్ అయితే తినమని బలవంతం చేయకు అని మాధురి అంది… నేను రియల్ ఫ్రెండ్‌యే తినకపోతే జుట్టు పట్టి తోసెస్తా తినురా అంటూ సంజన అడిగింది. కాసేపటి తర్వాత బిగ్‌బాస్ ముఖ్యమైన అనౌన్స్‌మెంట్ చేశాడు. ఫ్లాగ్‌ని పొందేందుకు మరో అవకాశం ఇస్తున్నాను అంటూ బాక్స్ టాస్క్ పెట్టాడు బిగ్‌బాస్. భరణికి బాలేనందున ఈ టాస్కులో ఎవరినైనా ఆడించొచ్చని బిగ్‌బాస్ చెప్పాడు. ఈ టాస్కులో దివ్య చాలా అవలీలగా గెలిచేసింది. దీంతో ప్యాలెస్ మీద పెట్టడానికి మొదటి ఫ్లాగ్ భరణికే దక్కింది.

మాధురి ఎంతకీ తినకపోయేసరికి ఇమ్మూ మరోసారి వెళ్లి మాట్లాడాడు. తనూజ అన్న మాటకి హర్ట్ అయ్యారా.. తను ఏదో సరదాగా అనుంటుంది.. ఉండండి అంటూ తనూజని పిలిచాడు ఇమ్మూ. నువ్వు సరదాగానే అన్నావ్ కదా అక్క సీరియస్‌గా తీసుకుంది చెప్పు ఒకసారి అని ఇమ్మూ అడిగాడు. దీనికి నేను నా డ్యూటీ చేస్తున్నా ఇమ్మూ.. నేను మాట్లాడితే అరుస్తున్నా అంటున్నారు కదా అందుకే దూరంగా ఉన్నా అంటూ తనూజ చెప్పింది.

ఆ వెంటనే రైట్ కలర్- రైట్ కనెక్షన్… అంటూ మూడో టాస్క్ పెట్టాడు బిగ్‌బాస్. ఈ టాస్కులో భరణి తరఫున ఇమ్మానుయేల్ బరిలోకి దిగాడు. నీ తరఫున నేను ఆడతానని డీమాన్ అడిగాడు. కానీ శ్రీజ మాత్రం కళ్యాణ్ వైపే ఇంట్రెస్ట్ చూపించింది. కాసేపటికి మాధురి దగ్గరికొచ్చి నాకు జడేస్తావా అని తనూజ అడిగింది. దీంతో మాధురి జడేస్తూ రీతూ ఇందాక నా దగ్గరికొచ్చి ఏమందో తెలుసా. మీరు నాది డీమాన్‌ది అన్ హెల్తీ రిలేషన్ షిప్ అన్నారు కదా.. అన్‌ హెల్తీ రిలేషన్‌లోనే ఈగోలు ఉంటాయి.. కోపం వచ్చి మాట్లాడుకోరు.. మీ ఇద్దరిలా.. మాది హెల్తీ రిలేషన్ అందుకే ఎన్ని గొడవలైనా కలిసిపోతామని చెప్పింది తెలుసా అంటూ మాధురి చెప్పింది.

Also Read:దుల్కర్ సల్మాన్.. ‘కాంత’

- Advertisement -