BB9:హౌస్ తొలికెప్టెన్‌గా సంజనా

12
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9 తెలుగు విజయవంతంగా 5 రోజులు పూర్తి చేసుకుంది. ఇక కెప్టెన్‌గా సంజన రఫ్‌ ఆడిస్తోంది. బిగ్‌బాస్ హౌస్‌కి తొలి కెప్టెన్ అయ్యేందుకు పెట్టిన టాస్కులో ఇమ్మూని సంచాలక్ మనీష్ తప్పించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రాడ్స్ తీసేందుకు సంజనని పిలిచాడు మనీష్. ఇది విని ఇమ్మాన్యుయేల్ ఫైర్ కాగా సంజన వెళ్లి పవన్ కళ్యాణ్ కాలు కింద ఉన్నరాడ్ పీకడంతో మనోడు సపోర్ట్ కోసం పైన ఉన్న వాల్ రూఫ్‌ని టచ్ చేశాడు. ఇది చూసిన టెనెంట్స్‌ వెంటనే సంచాలక్‌కి చెప్పి వాదించారు.దీంతో పవన్ కళ్యాణ్ ఔట్ సో హరీష్ టీమ్ ఎలిమినేట్ అయింది అంటూ మనీష్ చెప్పాడు.

కాసేపటికి ప్రియ కూడా నిల్చోలేక పక్కకి తిరిగింది. దీంతో ప్రియ కూడా ఔట్ అయిపోయింది. చివరిగా రాము రాథోడ్, దమ్ము శ్రీజ మాత్రమే మిగిలారు. ఈ గేమ్‌లో శ్రీజ గెలిచింది. శ్రీజ గెలవడంతో సంజన కెప్టెన్ అయిపోయింది. సంజన కెప్టెన్ అవ్వడంతో బిగ్‌బాస్ అభినందనలు తెలిపాడు. సంజన మీరు కెప్టెన్‌గా మాత్రమే కాకుండా టెంపరెరీ ఓనర్‌గా మారి వారం రోజుల పాటు హౌస్‌లో అన్ని సౌకర్యాలు పొందే అర్హత సాధించారు అంటూ చెప్పాడు .

ర్వాత తన లగేజి మొత్తాన్ని కెప్టెన్ రూమ్‌కి షిఫ్ట్ చేయడానికి ఎవరైనా సాయం చేస్తారా అని సంజన అడిగితే ఇమ్మాన్యుయేల్ నేను చేస్తా అన్నాడు. ఎక్కువ లగేజి ఉంది ఇంకొకరు కూడా కావాలి… ఫ్లోరా నువ్వు రా నా లగేజి తీసుకురా అంటూ సంజన చెప్పింది. దీనికి ఫ్లోరా ససేమీరా అనడంతో కెప్టెన్ మాట వినట్లేదు కదా సరే దీని పర్యవసానాలు ఏంటో నీకు రేపు చెప్తా అంటూ వార్నింగ్ ఇచ్చింది సంజన.

ఉదయం కాగానే నన్ను ఇంప్రెస్ చేసిన వాళ్లకి థంమ్స్ అప్ ఇస్తా అంటూ సంజన ఆఫర్ ఇచ్చింది. దీంతో రాము రాథోడ్ సంజన కొంగు పట్టుకొని తిరుగుతూ మహారాణి అంటూ తెగ పొగిడాడు. తర్వాత హౌస్‌లో అందరూ కలిసి ఒక స్కిట్ చేయండి నవ్వుకోవాలి అంటూ సంజన అంది. దీంతో రచ్చబండ టైపులో అందరూ కలిసి ఒక స్కిట్ చేశారు.

Also Read:రష్యాలో మళ్లీ భారీ భూకంపం

- Advertisement -