BB9:నామినేషన్స్‌పై చర్చ..రచ్చ

3
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9 తెలుగు విజయవంతంగా 44 రోజులు పూర్తి చేసుకుంది. నామినేషన్స్ ప్రక్రియ పూర్తి కాగా ఇంటి సభ్యులు ఈ రెండు రోజులు జరిగిన దాని గురించి చర్చించుకున్నారు. కెప్టెన్ గౌరవ్‌ని మాధురి ఒక కొశ్చన్ అడిగింది. అయేషాని ఎందుకు సేవ్ చేశావ్.. అని మాధురి అడిగితే ఇమ్మూ-అయేషా చెప్పారు.. నన్ను వాళ్లు నామినేషన్ నుంచి సేవ్ చేశారు అందుకే అని గౌరవ్ అన్నాడు. ఇంతలో తనూజ అక్కడికి రావడంతో చూశావా అయేషాని సేవ్ చేయమని ఇమ్మూ చెప్పాడంట అంటూ మాధురి చెప్పింది. తర్వాత కళ్యాణ్‌తో నామినేషన్స్‌లో జరిగినదాని గురించి ఇమ్మూ డిస్కస్ చేశాడు. రేయ్ నాకు అర్థమైందిరా నీ రీజన్.. అని ఇమ్మూ అంటే క్లియర్ కట్‌గా ఒక్క పాయింట్ కూడా మిగల్చలేదన్నా రమ్య.. ఒక్కటి కూడా.. అంటూ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు.

దివ్యతో వాష్ రూమ్ ఏరియా దగ్గర తనూజ మాట్లాడింది. వాడు (కళ్యాణ్) నన్ను నామినేట్ చేయలేదని చెప్పి వాయిస్ రెయిజ్ చేసి మాట్లాడటానికి అంతలా ఏముంది నాకు అర్థం కాలేదు.. నాకు అర్థమే కాలేదు అని తనూజ చెప్పగా ఇమ్మూ వెనకాల వచ్చి నిల్చున్నాడు. దీంతో అది తనతోనే చెప్పు.. అని దివ్య సైగ చేసింది. వద్దురా.. నాకు అక్కర్లేదు.. అని తనూజ సీరియస్ అయింది. అవును వాళ్లు వాళ్లు చూసుకుంటారు నేను సేఫ్‌గా ఉంటా.. వాళ్లు వాళ్లు కొట్టుకుంటారు నేను సేఫ్‌గా ఉంటా అంటున్నాడు.. అని తనూజ అంది. నిమిషాల్లో మారిపోతే ఎవరైనా సేఫ్ గేమ్ అని అనుకుంటారు.. నాకు అది నచ్చలేదు.. ఇలాంటి వ్యక్తినా నేను సపోర్ట్ చేసుకొని వచ్చింది అని నాకు బాదేసింది.. అంటూ ఇమ్మూ కామెంట్స్ చేశాడు. నీకు మొత్తం అన్నీ గేమ్స్‌లోనూ నేను సపోర్ట్ చేసుకుంటూ వచ్చినప్పుడు నాగ్ సార్ అడగ్గానే ఇతను నా గురించి అసలు స్టాండ్‌యే తీసుకోడని అన్నప్పుడు నాకు బాధ అనిపించదా.. ఇలాంటి పర్సన్ గురించి ఎందుకు నిలబడాలని అనిపిస్తుంది నాకు కూడా.. బెడ్ గేమ్, వాటర్ గేమ్‌లో కూడా నీ కోసం సేఫ్ గేమ్ ఆడినోడ్ని అయ్యాను.. అంటూ ఇమ్మూ తన మనసులో ఉన్నది అంతా కక్కేశాడు.

రాత్రి కెప్టెన్సీ రూమ్‌లో గౌరవ్‌తో ముచ్చట్లు పెట్టింది అయేషా. రమ్య తనూజని పర్సనల్‌గా అటాక్ చేస్తుంది.. ఎందుకో నాకు తెలీడం లేదు.. అని అయేషా అడిగింది. ఎందుకంటే తనూజ లాస్ట్ వీక్ సుమన్ గారిని నామినేట్ చేసింది.. అలానే రమ్యకి సుమన్ గారితో మంచి బాండింగ్ ఉంది కదా అందుకు కావచ్చు.. అని గౌరవ్ అన్నాడు.

Also Read:కే ర్యాంప్..బ్రేక్ ఈవెన్!

- Advertisement -