BB9:ఆరో వారం నామినేషన్స్ పూర్తి

6
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9 తెలుగు విజయవంతంగా 37 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా రీతూ ముందుగా భరణిని నామినేట్ చేసింది. తన రెండో నామినేషన్ దివ్యకి వేసింది రీతూ. అయితే ఈ రెండింటిలో ఒకరిని సేఫ్ చేసి ఒక నామినేషన్ మాత్రమే సెలక్ట్ చేయాలి. నేను భరణిని సేవ్ చేస్తున్నాను దివ్యని నామినేట్ చేయాలనుకుంటున్నాను అంటూ మాధురి షాకిచ్చింది. మేము హౌస్‌కి కొత్తగా వచ్చాం.. మీరు చాలా రోజులుగా ఉన్నారు.. మాకు కోఆపరేట్ చేయాలి.. మా మీద అరవకూడదు.. అని మాధురి చెప్పింది.

తర్వాత వైల్డ్‌కార్డ్స్ నుంచి గౌరవ్ బాల్ సంపాదించి సంజనకి ఇచ్చాడు. ఇక సంజన రాముని ఫస్ట్ నామినేట్ చేసింది. తర్వాత భరణిని నామినేట్ చేసింది సంజన. అసలు నేను మీ జోలికి రాకూడదు అనుకున్నాను.. ఎందుకంటే ఎలిమినేట్ అయిన నన్ను మీరు మీ త్యాగాలతో ఇక్కడికి తీసుకువచ్చారు.. అందుకే మీకు వ్యతిరేకంగా ఏం చేయనని మాటిచ్చాను.. కానీ నాకు బాలేనప్పుడు నన్ను హౌస్‌లోకి రాకుండా రాముతో మీరే చెప్పి అలా చేయించారు.. అది నాకు నచ్చలేదు అంటూ సంజన చెప్పింది. దీనికి భరణి ఇచ్చిపడేశాడు. మీ కోసం బాక్స్ త్యాగం చేసింది నేను.. అలాంటిది బెడ్ టాస్క్‌లో గేమ్ ఆడితే మీరు గూండాలు అని ఎలా అంటారు.. ఆ మాట వెనక్కి తీసుకోండి.. మరి ఇప్పుడు వైల్డ్‌కార్డ్స్‌లో వాళ్లు అమ్మాయిలు కాదా.. వాళ్లు పోటీపడలేదా.. గూండాలు అనకూడదు.. అంటూ భరణి క్లాస్ పీకాడు. ఇక ఒకవేళ నేను రాముతో మీ పేరు చెప్పి మిమ్మల్ని లోనికి రాకుండా అడ్డుకున్నానని ప్రూ చేస్తే నేనే హౌస్ నుంచి వాకౌట్ చేస్తా అంటూ భరణి సవాల్ చేశాడు. మధ్యలో సంజన మాట్లాడుతుంటే వినండి..

తర్వాత బాల్ అయేషాకి దొరకడంతో సుమన్ శెట్టి చేతికి ఇచ్చింది. సుమన్ శెట్టి ముందుగా తనూజని నామినేట్ చేశాడు. నెక్స్ట్ సంజనని నామినేట్ చేస్తూ హౌస్‌లో ఏదైనా గొడవ జరుగుతుందంటే మీకెందుకమ్మా అంత సంతోషం అని చెప్పాడే. వీరిద్దరిలో తనూజని నామినేట్ చేసి సంజనని సేఫ్ చేసింది అయేషా.

ఇక నామినేషన్స్ ప్రక్రియ చివరిలో కెప్టెన్‌కి బిగ్‌బాస్ ఒక పవర్ ఇచ్చాడు. నామినేషన్స్‌లో లేని (వైల్డ్‌కార్డ్స్‌ని మినహాయించి) ఒక సభ్యుడ్ని కెప్టెన్ కళ్యాణ్ నేరుగా నామినేట్ చేయాలని బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో రాముని నామినేట్ చేశాడు కళ్యాణ్.

Also Read:KTR:దొంగ ఓట్ల వ్యవహారంపై కోర్టుకు వెళ్తాం

- Advertisement -