బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9 తెలుగు విజయవంతంగా 30 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా ఫౌల్ గేమ్ ఆడటంతో ఇంటి సభ్యులపై సీరియస్ అయ్యాడు బిగ్ బాస్. వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు సో మీ ప్లేసులు గల్లంతే అంటూ వార్నింగ్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ వారం ముగిసేలోపు ఎవరైతే డేంజర్ జోన్‌లో చిక్కుకొని ఉంటారో వాళ్లు ఎవిక్షన్ ప్రక్రియ తీసుకొచ్చే ఎప్పుడూ చూడని తీవ్రమైన ఫైర్ స్ట్రామ్‌ని ఎదుర్కోక తప్పదు అని చెప్పాడు బిగ్ బాస్.
మీ స్థానాన్ని కాపాడుకోవడానికి మీకున్న ఒకే ఒక్క ఛాన్స్ ఇదే.. ఇప్పటినుంచి నేను మీకు కొన్ని ఛాలెంజస్ ఇస్తాను.. వాటిలో మీ ప్రదర్శన ఆధారంగా మీకు పాయింట్స్ లభిస్తాయి.. లీడర్ బోర్డ్‌లో మీరు ఎంత పైన ఉంటే ఈ ఇంట్లో కొనసాగేందుకు మీ అవకాశాలు అంత మెరుగవుతాయి అని చెప్పాడు. ఇక మీదట ఎవరూ ఓనర్స్, టెనెంట్స్‌గా ఉండరు..మీ ఆహారాన్ని మీకు పంపించే రేషన్‌ని ఉపయోగించుకొని ఇంటి లోపలే తయారు చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పాడు బిగ్‌బాస్.
డేంజర్ జోన్‌లో ఉన్న సభ్యులకి నేను ఇస్తున్న మొదటి టాస్క్ ‘పట్టువదలకు’.. స్టార్ట్ బజర్ మోగగానే డేంజర్ జోన్‌లో ఉన్న ప్రతి జంటలో నుంచి ఒకరు తమకి కేటాయించిన సీ-సా హ్యాండిల్‌ని పట్టుకోవాలి.. సీ-సా బాక్స్‌లో ఇసుకని నింపి.. ఆ బాక్స్ బరువును పెంచి దాన్ని ప్లాట్‌ఫామ్‌కి టచ్ అయ్యేలా చేయాలి.. ఏ జంట అయితే తమ సీ-సాని ప్లాట్‌ఫామ్‌కి టచ్ అవ్వకుండా వీలైనంత ఎక్కువసేపు పట్టుకుంటారో వాళ్లు ఈ టాస్క్‌లో కొనసాగుతారు అని చెప్పాడు. ఈ టాస్కులో డీమాన్-రీతూ టీమ్ ఫస్ట్ ప్లేస్ సాధించింది. తర్వాతి స్థానాల్లో భరణి-దివ్య, కళ్యాణ్- తనూజ, సంజన-ఫ్లోరా, సుమన్-శ్రీజ వరుసగా నిలిచారు.
Also Read:భూమనపై భాను ప్రకాష్ రెడ్డి మండిపాటు
తర్వాత బిగ్‌బాస్ బెలూన్ టాస్క్ పెట్టాడు. డేంజర్ జోన్‌లో ఉన్న సభ్యులకి నేను ఇస్తున్న రెండవ టాస్క్.. ఈ టాస్కులో ఏ జంట అయితే ఐదు నిమిషాలు లేదా ఐదు నిమిషాలకి దగ్గర సమయం మీరు ఊదిన బెలూన్ బాక్స్‌లో ఉన్నవారి నీడిల్ మాస్క్‌కి తగిలి పగలకుండా గాలిలో ఉంచగలుగుతారో వాళ్లు ఈ టాస్కులో విజేతలుగా నిలుస్తారు అని చెప్పాడు. అయిత ఫౌల్ గేమ్ ఆడటంతో ఇంటి సభ్యులపై సీరియస్ అయ్యాడు బిగ్ బాస్. మీరు చదివిన స్కూల్‌కి చదువుతున్న స్కూల్‌కి ప్రిన్సిపల్ నేనని గుర్తుంచుకోండి.. రాము-ఇమ్మానుయేల్ ఇది మీరు చూస్తూ ఏం చేస్తున్నారో కాస్త చెప్తారా.. అంటూ బిగ్‌బాస్ ఫైర్ అయ్యాడు.గెలిచినా తమకి పాయింట్లు రాలేదంటూ సంజన ఏడుపు మొదలుపెట్టింది.

