బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9 తెలుగు విజయవంతంగా 22 రోజులు పూర్తి చేసుకుంది. రెండోసారి కెప్టెన్ అవ్వగానే డీమాన్ విశ్వరూపం చూపించారు. ఇక ఉదయం కాగానే కిచెన్‌లో తుపాను మొదలైంది. ఫుడ్ మానిటర్ అయిన తనూజ దగ్గరికెళ్లి అమ్మా నాకు కొంచెం పోపు కావాలి.. చేయించుకుంటున్నా కుక్స్ చేత అని సంజన అడిగింది. దీనికి తనూజ కూడా ఓకే చెప్పింది. అయితే డీమాన్ వెంటనే నో అన్నాడు.
దీనికి సంజన హర్ట్ అయింది. లేదురా నాకు వద్దు నాకు బ్రేక్‌ఫాస్ట్‌యే వద్దు.. వచ్చి పర్మిషన్ అడిగా తనూజ నేను నిన్ను.. నేను ఏం డైరెక్ట్‌గా వచ్చి వీళ్లకి చెప్పలేదు.. తినేదానికి ఏంటి భిక్ష వేస్తున్నారా.. అంటూ లోపలికి వెళ్లిపోయింది సంజనా. ఆమెను ఓదార్చేందుకు డీమాన్, తనూజ వచ్చారు. సంజన .. మీరు ఇంతగా మాట్లాడుతున్నారు కదా.. ఫుడ్ విషయానికొస్తే నాకు షుగర్‌తో కావాలి, నాకు కారంతో కావాలి నాకు సలాడ్‌తో కావాలని మీరు అడిగినప్పుడల్లా.. అక్కడ ఆ ఛాన్స్ ఉందంటే మీకే మేము ఇచ్చాం అంటూ తనూజ చెప్పుకొచ్చింది.
ఇక వీళ్ల గొడవ చూసి హే ఆగొచ్చు కదా తినే దాని గురించి కూడా గొడవలాడుకుంటారు ఇలా పొద్దున్నే.. అంటూ భరణి అరిచాడు. అదే చెప్తున్నా అన్నా తినే దాని గురించి కూడా ఇంత గొడవ ఎందుకని అంటూ సంజన ఎమోషనల్ అయింది. సీన్ కట్ చేస్తే కొంతసేపటి సంజనాకు సారీ చెప్పాడు డీమాన్.
అయితే ఏమాత్రం తగ్గని సంజనా.. కంట్రోల్ తప్పి మాట్లాడింది. నేను కనిపించలేదు మీకు ఓన్లీ దివ్యనే కనిపించింది.. నేను వెయ్యి సార్లు మీ దగ్గర బతిమాలుతున్నాను అయినా మీకు కనిపించలేదు అంటూ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసింది . మరోవైపు ఈ వారం నామినేషన్స్ నుంచి ఇమ్యూనిటీ పొందేందుకు బిగ్‌బాస్ టాస్కులు పెట్టాడు. ముందుగా డీమాన్‌ని సంచాలక్ చేసి ఉన్న 12 మందిని ఇద్దరిద్దరు చొప్పున ఆరు టీములుగా బిగ్‌బాస్ డివైడ్ చేశాడు. రెండు టీములకి ఒకసారి టాస్కు పెట్టారు. ఇందులో సుమన్ శెట్టి-దివ్య టీమ్ మాత్రమే గెలిచింది. మిగిలిన టీమ్‌లు ఫౌల్ చేశాయి. దీంతో బిగ్‌బాస్ గెలిచిన సుమన్ శెట్టి, దివ్యలకి ఓ పవర్ ఇచ్చాడు. మీతో పాటు రెండో రౌండ్ ఇమ్యూనిటీ టాస్కులో పాల్గొనేందుకు ఇద్దరిని ఎంపిక చేయాలన్నాడు. ఈ వారం ఇమ్యూనిటీ పవర్‌ని వీళ్లిద్దరూ గెలుచుకొని నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యారు.
Also Read:మంత్రి లోకేశ్‌కు తిలక్ వర్మ గిఫ్ట్

