BB9:డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు!

4
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9 తెలుగు విజయవంతంగా నాలుగోవారం పూర్తి చేసుకోవడానికి వచ్చింది. నాలుగో వారం నామినేషన్స్ ప్రక్రియ పూర్తయింది. ఈ వారం బిగ్‌బాస్ చిన్న ట్విస్ట్ ఇస్తూ నామినేషన్స్ కంటే ముందు ఇమ్యూనిటీ టాస్కులు పెట్టాడు.

ఇందులో తనూజ గౌడ, సుమన్ శెట్టి ఇద్దరూ ఇమ్యూనిటీ పొందడంతో ఈ వారం నామినేషన్స్ నుంచి సేఫ్ అయిపోయారు. అలానే డీమాన్ పవన్ కెప్టెన్ కావడంతో తనని ఎవరూ నామినేట్ చేయడానికి వీల్లేదు. దీంతో మిగిలిన 10 మందిలోనే నామినేషన్ ప్రక్రియ జరిగింది. ఇందులో మొత్తం ఈ వారం ఆరుగురు సభ్యులు నామినేషన్స్ లిస్ట్‌లో చేరారు.

ఫ్లోరా,రీతూ,సంజన,హరీష్,దివ్య,శ్రీజ ఉండగా ఈ నామినేషన్స్ లిస్ట్ గమనిస్తే ఈ వారం శ్రీజ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకూ శ్రీజ నామినేషన్స్‌లోకే రాలేదు. శ్రీజతో పాటు దివ్య కూడా తొలిసారి నామినేషన్స్‌లో ఉంది.

Also Read:స్థానిక ఎన్నికలు..లక్కంటే వీరిదే!

- Advertisement -