బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విజయవంతంగా 24 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా హోటల్ టాస్క్ ఆసక్తికరంగా సాగింది. ఇనయ.. వాసంతి దగ్గర కూర్చుని గ్రూప్‌లో ఉండి ఎవరి గేమ్ వాళ్లు ఆడుకున్నారు.. నేను మాత్రం గ్రూప్ గెలవాలని ఆడాను. అందుకే చెడ్డదాన్ని అయిపోయాను అని బాధపడింది ఇనయ. ఈ నామినేషన్స్ ఏంటో.. ఒకడేమో ఏం మాట్లాడతాడో వాడికే తెలియదు.. ఈమె (ఇనయ) ఏమో అన్నది ఒకటి అయితే నానార్ధాలు పర్యాయపదాలు తీస్తుందని తనలో తానే మాట్లాడుకున్నాడు శ్రీహాన్. ఇనయకు ఆస్కార్ ఇచ్చినా తక్కువేనని తెలిపాడు.
ఈసారి ఎలిమినేషన్ చాలా టఫ్.. ఎవరైనా పోవచ్చు అని తెలిపాడు ఆదిరెడ్డి. సూర్య, రేవంత్, గీతు, శ్రీహాన్ ఈ నాలుగురు తప్ప ఎవరైనా పోవచ్చు అని రేవంత్‌తో చెప్పాడు. పైకి ధైర్యంగానే ఉన్నా.. నాకు కూడా భయంగా ఉందని రేవంత్ అంటే.. నువ్ పెర్ఫామెన్స్ ఇస్తున్నావ్.. నిన్ను ఎలిమినేట్ చేయరు పక్కా అని చెప్పుకొచ్చాడు ఆదిరెడ్డి.
ఇక ఆరోహి, ఆర్జే సూర్యలు ఇద్దరూ హగ్ చేసుకుని రొమాన్స్ పండించారు. తర్వాత ఇద్దరూ సొల్లు మాటలతో చికాకు తెప్పించారు. తర్వాత పెదాలతో కిస్ కావాలా అన్నట్టుగా సిగ్నల్ ఇచ్చింది. వీళ్ల కథ ఏంటో.. వీళ్ల లవ్ ట్రాక్ ఏంటో కానీ.. వీళ్లిద్దరూ మాత్రం మసాలా దట్టించి.. ఏదో విధంగా కెమెరాల్లో పడటానికి తెగ ట్రై చేస్తున్నారు. తర్వాత బిగ్ బాస్ హోటల్ టాస్క్ మొదలుకాగా చంటికి సీక్రెట్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్.