బిగ్ బాస్ తెలుగు 6 విజయవంతంగా 30 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 30వ ఎపిసోడ్‌లో భాగంగా ఇవాళ తన బర్త్ అని ఇంటి సభ్యులంతా తనను ఎంటర్‌టైన్ చేయాలని కోరారు బిగ్ బాస్. ఇందులో భాగంగా ఆర్జే సూర్య మిమిక్రీ చేశాడు, ఫైమా కామెడీ స్కిట్ చేసింది. శ్రీహాన్-శ్రీసత్య ఒక సాంగ్ కి ఫుల్ కెమిస్ట్రీతో డ్యాన్స్ వేశారు.
ఇక గీతూకి బిగ్‌బాస్ పిలిచి మరీ సీక్రెట్ గా లంచం ఇచ్చి హౌస్ లో గాసిప్స్ చెప్పమనడంతో తన నోటికి వచ్చినవి చెప్పేసింది. ఇనయ-ఆర్జే సూర్య మధ్య ఏదో ఉందని, ఇనయా ఎంత ట్రై చేసినా సూర్య పట్టించుకోవట్లేదని, శ్రీసత్యను అర్జున్ బాగా ట్రై చేస్తున్నాడని, బాలాదిత్య దీపు దీపు అని కలవరిస్తాడని చెప్పింది.
అరగంటకు పైగా సీక్రెట్ రూమ్ లో ఉంది వచ్చిన గీతూతో బిగ్‌బాస్ ఏం చెప్పాడు అని అంతా అడిగారు, కానీ గీతూ గురించి తెలిసిందే కదా. ఏదేదో కథలు అల్లేసి నా గురించి మీరేమనుకుంటున్నారో బిగ్‌బాస్ నాకు చెప్పేసాడు అంటూ హడావిడి చేసింది. బిగ్‌బాస్ ఇచ్చిన చికెన్ ఎవరికీ పెట్టకుండా అందర్నీ ఊరించి మరీ తింది.ఆ తర్వాత ఫైమాని సీక్రెట్ రూమ్ లోకి పిలిచి. ఒక పిజ్జా ఆఫర్ చేసి అది తినాలంటే ఒక టాస్క్ చేయాలని చెప్పాడు. హౌస్ లో రాత్రి పూట అందరి నిద్రని మూడు సార్లు చెడగొట్టాలి, కానీ అది నువ్వని తెలీకూడదు అని అని చెప్పాడు.