కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ‘బిగ్‌బాస్’తెలుగు సీజన్ 5 మంచి రేటింగ్‌తో దూసుకుపోతుంది.. ఇక ప్రతి వారం నామినేషన్ల ప్రక్రియతో హౌస్ వేడెక్కుతోంది. ఐదు వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ హౌస్‌లో ఆరో వారంలో నామినేషన్లు చాలా విభిన్నంగా సాగుతున్నాయి. సోమవారం ప్రసారంకానున్న ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. ఆ విశేషాలివీ.. ఈ వారం నామినేషన్ ప్రక్రియ ఎప్పుడూ జరగని విధంగా జరుగుతుందని రవి చెప్పిన మాటతో ప్రోమో ప్రారంభమైంది.
ఓ టేబుల్‌పై ఉన్న అరటిపండ్లని ఎవరైతే తీసుకుంటారో.. వారికి నామినేట్ చేసే అవకాశం కల్పించాడు బిగ్‌బాస్. ఈ టాస్క్‌లో షణ్ముఖ్, సిరి, కాజల్ గెలిచారు. అలా యానీ మాస్టర్‌ని షణ్ముఖ్ నామినేట్ చేయగా సిరి.. మానస్‌ని నామినేట్ చేసింది. ‘సారీ చెప్పారు. కానీ నేను దాన్ని అంగీకరించలేకపోతున్నా’ అని తెలియజేసింది. ఆ తర్వాత కాజల్.. ప్రియని నామినేట్ చేసింది. మరోవైపు, సన్నీ, శ్రీరామ చంద్ర, జశ్వంత్ వేటగాళ్లుగా సందడి చేశారు. ఓ సందర్భంలో ‘అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు’ అని ప్రియాంక ఫైర్ అయింది. ‘ఆరు వారాల నుంచి చదువుతున్నారా’ అని రవి అనగానే ‘నాకు నచ్చింది నేను చేస్తా, నేను హంటర్‌ని’ అంటూ సన్నీ సమాధానమిచ్చాడు. మరి ఏ కారణంతో సిరి, షణ్ముఖ్, కాజల్ నామినేట్ చేశారు? రవి- సన్నీ మధ్య ఇంకా ఏం జరిగింది? తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ చూడాల్సిందే.