‘అవకాశం వస్తే కచ్చితంగా బాండ్‌గర్ల్‌గా ప్రేక్షకులకు కనిపిస్తా’ అని అంటోంది బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా. ‘క్వాంటికో’ టెలివిజన్ సిరీస్‌తో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక ప్రస్తుతం ‘బేవాచ్’ అనే హాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది. హాలీవుడ్ లో అదరగొడుతుంది. క్వాంటికో సీరియల్ లో నటిస్తూనే బేవాచ్ అనే చిత్రంలో ప్రతి నాయకి పాత్ర పోషిస్తోంది.
1990లో టెలివిజన్ సిరీస్‌గా ప్రసారమై బుల్లి తెర ప్రేక్షకుల్ని అలరించిన బేవాచ్ సిరీస్ ఆధారంగా అదే పేరుతో ప్రస్తుతం సినిమాని రూపొందిస్తున్నారు. కాకతాళీయంగానే అయినా ఇటు బాలీవుడ్‌లోను, అటు హాలీవుడ్‌లోనూ ప్రియాంక ఎంట్రీ మాత్రం విలన్‌గానే జరగటం విశేషం. ఐత్ రాజ్ అనే మూవీతో ప్రియాంక బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన విషయం విదితమే. బేవాచ్ చిత్రంలో డ్వేన్ జాన్సన్, జాక్ ఎఫ్రాన్, కెల్లీ రోహ్రబాక్, అలెజాండ్ర దాద్రిరియో వంటి హాలీవుడ్ స్టార్స్ కీలక పాత్రలు పోషించగా తాజాగా చిత్ర మొదటి ట్రైలర్ విడుదల చేశారు. ఇందులో ప్రియాంక చోప్రా ఒక్క సెకండ్ మాత్రమే కనిపించిన, తన అందాలతో అలరించింది.