ఆర్టీసీలో 22 ఎలక్ట్రిక్ బస్సులు:భట్టి

14
- Advertisement -

ఆర్టీసీలో 22 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి పాల్గొనగా కోమటిరెడ్డి బస్సును నడపగా అదే బస్సులో సచివాలయం వరకు వెళ్లారు భట్టి, పొన్నం.

ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ..ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతీ హమీని నెరవేరుస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అణగారిన వర్గాల అభ్యన్నతే లక్ష్యంగా ముందుకు సాగుతుందన్నారు. గత ప్రభుత్వంలో ఆర్టీసీ సిబ్బంది జీతాలకోసం ఇబ్బండి పడేవారని, ఆర్టీసీ ఆస్తులను కోల్పోతుందనే ఆందోళన ఉండేదని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం టీఎస్ఆర్టీసీ అభివృద్ధికి దోహదపడుతూనే ఉంటుందని …మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి, మహాలక్ష్మీ పథకాలను మూడు నెలల్లోనే అమలు చేశామని భట్టి చెప్పారు.

Also Read:KTR:తీవ్ర జ్వరం..కరీంనగర్ సభకు రాలేకపోతున్న

- Advertisement -