అర్హులందరికి సంక్షేమం అందాలి:భట్టి

20
- Advertisement -

అర్హులందరికి సంక్షేమ పథకాలు అందాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మంగళవారం డా.బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయంలో జిల్లా కలెక్టర్లు పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలతో నిర్వహించిన సదస్సులో సీఎం రేవంత్‌ రెడ్డితో కలిసి సమావేశమయ్యారు. అధికారులు విస్తృతంగా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకోవాలన్నారు. ప్రభుత్వం అందజేసే ప్రతి సంక్షేమ పథకం అర్హులకు చేరాలన్నారు.

తెలంగాణను మీ సొంత రాష్ట్రంగా భావించి పనిచేయాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలకు ప్రయోజనం చేకూరేలా మానవీయ కోణంలో మీ నిర్ణయాలు ఉండాలన్నారు. ఇది ప్రజా ప్రభుత్వం అని ప్రజలకు విశ్వాసం కల్పించాలని తెలిపారు. ప్రభుత్వానికి కళ్లు, చెవులు మీరేనన్నారు.

Also Read:చండీపురా వైరస్..అజాగ్రత్తగా ఉంటే అంతే!

- Advertisement -