రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు..

164
Bathukamma

నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం జప్తి సదగొడు గ్రామంలో ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలలో పాల్గొన్నారు మహిళలు. మహిళలు గ్రామంలో దొరికే పూలను తెచ్చి ఎంగిలి బతుకమ్మను బొడ్డెమ్మను తయారుచేసి మహిళలు,చిన్నపిల్లలు సైతం ఒక దగ్గరకు చేరుకొని ఆట,పాటలతో సంబరాలలో మునిగిపోయారు.

ఆడబిడ్డలకు ఉత్సాహం, ఉల్లాసాన్ని పంచే బతుకమ్మ సంబురాలు శుక్రవారం నుంచి మొదలవుతున్నాయ్యాయి. తెలంగాణ రాష్ట్ర పండుగగా ఖ్యాతి గాంచిన బతుకమ్మ సంబురాలు తొమ్మిది రోజులపాటు పిల్లా పాపలకు సంతోషాన్నిస్తాయి. ఈ నెల 24న సద్దుల బతుకమ్మతో సంబురాలు ముగుస్తాయి.