హాట్ కేక్స్‌లా బతుకమ్మ చీరలు:కేటీఆర్

275
ktr
- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 12 నుంచి బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు మంత్రి కేటీఆర్. మాసబ్‌ట్యాంక్‌లోని పురపాలక శాఖ కమిషనర్‌ కార్యాలయంలో బతుకమ్మ చీరలను పరిశీలించిన కేటీఆర్.. మహిళలకు పండగ కానుకగా,నేతన్నలకు ఉపాధి దొరుకుతుందని బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు.ఈ సారి చీరలు హాట్ కేక్స్ లాగా తీసుకుంటారని.. ఈ కార్యక్రమం బిగ్ సక్సెస్‌ అవుతుందని చెప్పారు.

ఈ సంవత్సరం 95 లక్షల చీరలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఇప్పటికే జిల్లాలకు చీరలు చేరుకున్నాయని 80 రకాలైన రంగులలో జరీ అంచు పాలిస్టర్‌తో చీరలను తయారు చేసినట్లు వెల్లడించారు. ఒక్కో చీర ఖరీదు రూ. 290 కాగా.. చీరల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడలేదని కేటీఆర్ స్పష్టం చేశారు.

అన్ని చీరలను సిరిసిల్లలోని మరమగ్గాలమీద తయారు చేయించామన్నారు.చివరి చీరను చివరి మహిళకు ఇచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు.

- Advertisement -