- Advertisement -
ఈ నెల 23 నుంచి బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తామని తెలిపారు మంత్రి కేటీఆర్. గురువారం మధ్యాహ్నం సీడీఎంఏ కార్యాలయంలో బతుకమ్మ చీరల ప్రదర్శన నిర్వహించగా ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. బతుకమ్మ చీరల పంపిణీ కోసం ప్రభుత్వం రూ. 313 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. కోటి మంది ఆడపడుచులకు బతుకమ్మ చీరలు అందించనున్నట్లు చెప్పారు.
బతుకమ్మ చీరలతో నేతన్నలకు ఉపాధి కల్పిస్తున్నమన్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. 18 ఏళ్ల వయస్సు, తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఆడబిడ్డకు బతుకమ్మ చీర పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆడబిడ్డలకు వంద రకాల బతుకమ్మచీరలను అందిస్తున్నామన్నారు.
- Advertisement -