10 వేల మందితో ఎంగిలిపూల బతుకమ్మ

1159
warangal bathukamma
- Advertisement -

తెలంగాణ సంస్కృతికి నిలువెత్తు రూపం బ‌తుక‌మ్మ‌.. తెలంగాణ మ‌హిళ‌ల ఆత్మ‌గౌర‌వానికి చిహ్నం బ‌తుక‌మ్మ‌.. ప్ర‌కృతికి, మ‌నిషికి గ‌ల మ‌ధ్య సంబంధానికి ప్ర‌తీక బ‌తుక‌మ్మ‌. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

సెప్టెంబర్ 28(రేపటి) నుంచి ఎంగిలిపూల బతుకమ్మతో తొమ్మిదిరోజుల పాటు ప్రతిపల్లె ప్రకృతి పూల సోయగంతో అందాల వనంలా మారనుంది. వరంగల్‌ భద్రకాళి ఆలయంలో దాదాపు 10 వేల మందితో బతుకమ్మ పండుగను ఘనంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

చివరిరోజు సద్దుల బతుకమ్మ అక్టోబర్ 6వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగ ఘనంగా జరుగుతుంది. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో, రాజ్‌భవన్, తెలంగాణ అసెంబ్లీలోనూ ఘనంగా బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లుచేశారు. చివరి రోజు ఎల్బీస్టేడియం నుంచి ట్యాంక్‌బండ్ వరకు ర్యాలీ ఉండనుంది.

బతుకమ్మ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఎల్బీనగర్ స్టేడియం వేదికగా నిర్వహించిన మహా బతుకమ్మ ఉత్సవాలు గిన్నిస్‌ గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ రికార్డులకు ఎక్కాయి. ఏటా ఆడపడుచులకు ప్రత్యేకంగా బతుకమ్మ చీరలు ఉచితంగా ఇస్తోంది.

- Advertisement -