శాన్ ఫ్రాన్సిస్కోలో బతుకమ్మ సంబరాలు..

183
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ సంబురాలు దేశ,విదేశాల్లో అంబరాన్నంటుతున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత విదేశాల్లో బతుకమ్మ సంబురాలు నిర్వహిస్తున్నారు. వివిధ దేశాల్లో బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే దుబాయ్, యూకే, అమెరికాలో ఉత్సవాలు నిర్వహించారు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా ఫ్రీమాంట్ లోని రాయల్ ప్యాలెస్ లో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. బతుకమ్మను పేర్చిన కవిత.. నాగమల్లె జాతరో పాట పడి అందరిని ఉత్తేజపరిచారు. బతుకమ్మ వేడుకలకు తెలంగాణ ఆడపడుచులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

bathukamma

నిన్న తెలంగాణ జాగృతి అమెరికా శాఖ, తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ల ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించారు. అమెరికాలోని తెలంగాణ మహిళలు, యువతులు ఎంపీ కవితతో బతుకమ్మ ఆడేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు ఉత్సాహం చూపించారు. అంతకుముందు అందరినీ ప్రోత్సహిస్తూ ఎంపీ కవిత పాట పాడారు.

america

bathukamma

- Advertisement -