- Advertisement -
జర్మనీలోని మ్యూనిక్ నగరం లో తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబమైన సద్దుల బతుకమ్మ కన్నుల పండుగల జరిగింది. ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో ఎన్నారై మహిళలు పాల్గొన్నారు. బతుకమ్మ ఆటపాటలతో పరిసరాలు మార్మోగాయి. ఆడపడుచులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఉయ్యాల పాటలు పాడారు. పసందైన వంటకాలతో వేదిక గుమగుమలాడింది. ఇలా బతుకమ్మ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అని నిర్వాహకులు నరేష్ మేసినేని, అరవింద్ గుంత , సుష్మ మేసినేని, శ్రీలత శ్రీరంగం, కమల్, సుహాస్ అన్నారు.
- Advertisement -