బహరైన్‌లో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు..

518
Bathukamma Celebrations in Bahrain
- Advertisement -

తెలంగాణ పూల పండుగ బహరైన్‌లో ఘనంగా జరిగింది. తెలంగాణ జాగృతి బహరైన్ శాఖ ఆధ్వర్యంలో బహరైన్ లోని అదిలియాలో జరిగిన బతుకమ్మ సంబురాలు తెలంగాణ ఔన్నత్యాన్ని చాటాయి. ఈ కార్యక్రమానికి ఇండియన్ కౌన్సిల్ కల్చరల్ అసోసియేషన్ కార్యదర్శి మోహినీ భాటియా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Bathukamma Celebrations in Bahrain

ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి గల్ఫ్ అధ్యక్షులు చెల్లంశెట్టి హరిప్రసాద్ మాట్లాడుతూ.. గల్ఫ్‌లో ఉన్నప్పటికీ తెలంగాణ ఆడబిడ్డలు మన పండుగలు జరుపుకోవడం, సంస్కృతిని కాపాడుకోవడం గొప్ప విశయం అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్న ప్రవాస తెలంగాణ కార్మికులు బలవన్మరణాల బాట పట్టొద్దని విజ్ఞప్తి చేసారు. మనస్థైర్యం కోల్పోవద్దని కోరారు.

Bathukamma Celebrations in Bahrain

అనంతరం ఆడబిడ్డలు తాము పేర్చిన బతుకమ్మలను మధ్యలో ఉంచి సాంప్రదాయ పాటలను పాడి ఆడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి బహరైన్ అధ్యక్షులు బర్కుంట బాబూరావు, నాయకులు నాగశ్రీనివాస్, ప్రభాకర్, విజయవర్దన్, విజయ్ షిండే, అరుణ్, రవీందర్, నజీర్, సందీప్, నరేష్ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

- Advertisement -