ఆస్ట్రేలియాలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..

526
Bathukamma Celebrations in Australia
- Advertisement -

ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్‌లో తెలంగాణ సంప్రదాయాన్ని తెలిపే బతుకమ్మా ఉత్సవాలు ఆస్ట్రేలియన్ తెలంగాణ అసోసియేషన్ (ATAI) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఆస్ట్రేలియన్ ఎంపీ జిల్ హెనేస్సి(Jill Hennessy), మేయర్ జాన్ధన్ ఈ వేడుకలో పాల్గొని బతుకమ్మ ఆడటం ప్రత్యేకంగా నిలిచింది. ఈ వేడుకలో సుమారు 5000 వేల నుంచి 6000 వేల మంది పాల్గొని విజయవంతం చేశారు.

Bathukamma Celebrations in Australia

ఆస్ట్రేలియన్ ఎంపీ జిల్ హెనేస్సి(Jill Hennessy) మాట్లాడుతూ.. బతుకమ్మ ఆడటం ఎంతో ఆనందం కలిగించిందని, ఈ ఉత్సవాలు స్రీల గౌరవాన్ని పెంచేవిదంగా ఉన్నాయని తెలిపారు.

Bathukamma Celebrations in Australia

ఆస్ట్రేలియన్ తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రానున్న తరాల కు తెలంగాణ సంప్రదాయం మరియు బతుకమ్మ గొప్పతనం ప్రతి ఏటా ఈ బతుకమ్మ ఉత్సవాల ద్వారా తెలియ చేయటం ఎంతో గర్వంగా ఉందని వివరించారు. ఈ ఉత్సవాలను విజయవంతం చేయడానికి ఆరు నెలల నుండి ఎంతో కష్టపడ్డ వాలంటీర్స్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Bathukamma Celebrations in Australia

- Advertisement -