చేపమందు ప్రసాదం పంపిణీ చేసే బత్తిని హరినథ్ గౌడ్ అనారోగ్యంతో మృతి చెందారు. హైదరాబాద్‌లోని పాతబస్తీలో నివాసముంటున్న ఆయన తన నివాసంలోనే ఇవాళ తెల్లవారుజామున మరణించారు. మృగశిర కార్తె సందర్భంగా ఆయన పంపిణీ చేసే చేపమందు చాలా ప్రాముఖ్యం పొందింది. ఇవాళ సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.
బత్తిని హరినాథ్ గౌడ్ కు భార్య సునిత్రదేవి, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. పాత బస్తీ లోని దూద్ బౌలి ప్రాంతానికి చెందిన బత్తిని సోదరులు ఐదుగురు. శివరాం, సోమ లింగం, విశ్వనాథ్, హరినాథ్ గౌడ్, ఉమా మహేశ్వర్. బత్తిని సోదరులు పంపిణీ చేసే చేప ప్రసాదానికి 173 ఏళ్ల చరిత్ర ఉంది. బత్తిని వీరన్న గౌడ్, శివరాంగౌడ్ నుంచి ఈ ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. వీరి మూడో తరమైన శంకరయ్య గౌడ్ హయాంలో పంపిణీ బాగా ప్రాచుర్యం పొందింది. హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ప్రతి సంవత్సరం బత్తిని సోదరులు ఇచ్చే చేప మందు కోసం దేశ వ్యాప్తంగా ఆస్తమా రోగులు వేల సంఖ్యలో తరలి వస్తుంటారు.
Also Read:చంద్రయాన్ 3 విజయంలో తెలంగాణ సైంటిస్ట్