ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు, “తెలంగాణ బత్తాయి డే’ కార్యక్రమంలో భాగంగా ఎల్బీ నగర్‌లోని అక్షర ఇంటర్ నేషనల్ స్కూల్‌లో బత్తాయి పండ్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ అరిశనపల్లి జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో స్కూల్ పరిసర ప్రాంతంలో ఉన్న కాలనీ వాసులకు మరియు స్కూల్‌కు సంబంధించిన బస్ డ్రైవర్స్ లకు, హౌస్ కీపింగ్, సెక్యురిటిలకు బత్తాయి పండ్లను అక్షర ఇంటర్నేషనల్ ట్రాన్స్ పోర్ట్ ఎజీఎం నరేందర్ రెడ్డి పంపిణీ చేశారు. అదేవిధంగా స్కూల్ చుట్టూ ప్రాంతంలో ఉన్న కాలనీ వాసులకు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఇంటింటి తిరుగుతూ బత్తాయి పండ్లను పంపిణీ చేశారు.
శరీరంలో అనేక చర్యలు సాఫీగా జరగాలంటే విటమిన్ సి తప్పనిసరని ఉపాధ్యక్షులు, హ్యాండ్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జగన్మోహన్ రావు అన్నారు. విటమిన్ సి పుష్కలంగా ఉండే బత్తాయి పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల రోజువారి దినచర్య సాఫీగా సాగుతుందని.. కరోనా వైరస్ ప్రబలుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బత్తాయి పండ్లను పుష్కలంగా తినాల్సిన అవసరముందని జగన్మోహన్ రావు అన్నారు.
బత్తాయి పండ్లలో యాంటి యాక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వల్ల శరీరం చురుగ్గా ఉండటంతో పాటు ఎముకల పటుత్వం, కంటి చూపు మెరుగుపడుతుందని అన్నారు. స్కర్వీ వ్యాధి నివారణకు, జీర్ణక్రియ సాఫీగా సాగడానికి సి విటమిన్ పుష్కలంగా ఉండే బత్తాయి పండ్లు దివ్యౌషధంగా పనిచేస్తయని ఆయన అన్నారు. బత్తాయి పండ్లను బాగా తినటం వల్ల శరీరం పోషకాలను బాగా గ్రహించి రోగనిరోధక వ్యవస్థ పెంపొందుతుందని అన్నారు.
బత్తాయి పండ్లను కొనుగోలు చేసి వాటిని సాగుచేసే రైతులను ఆదుకోవాలన్న సీఎం కెసిఆర్ మాటలను కూడా అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ జగన్మోహన్ రావు ఈ సందర్భంగా గుర్తు చేశారు. మంచి ఆలోచనలతో రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన బత్తాయి డే కార్యక్రమం ఎంతో విజయవంతమైందని.. ఇంత మంచి ఆలోచన సంతోష్ కుమార్‌కి రావడం రైతన్నలకు ఎంతో మేలు జరిగిందని జగన్మోహన్ రావు అన్నారు.