- Advertisement -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్నా ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య. నైవేద్య విరామ సమయంలో కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న ఆయన మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు ఎమ్మెల్సీ దంపతులకు వేద ఆశీర్వచనం చేయగా, టీటీడీ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు, పట్టు వస్త్రాలను అందజేశారు.
శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా తెలిపారు సారయ్య. రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించిన సారయ్య..టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్పై శ్రీవారి ఆశీస్సులు ఎల్లవేలలా ఉండాలని ప్రార్థించినట్లు చెప్పారు.
- Advertisement -