జలదిగ్బంధంలో బాసర..

6
- Advertisement -

ఉగ్ర రూపం గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో జలదిగ్బంధంలో బాసర ఆలయం ఉంది. ఆలయ పరిసరాలు, సమీప దుకాణం సముదాయాలు, గెస్ట్ హౌస్ లు జలమయమయ్యాయి.

వ్యాస మహర్షి దేవాలయాన్ని తాకాయి గోదావరి జలాలు. ఆలయ సందర్శనకు రావొద్దని భక్తులకు అధికారులు సూచించారు. మరోవైపు భారీ వర్షాలు ఏపీని ముంచెత్తాయి.

ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాగులు దాటుతున్నారు గిరిజనులు. అల్లూరు జిల్లా జి.మాడుగల మండలంలో మాల్లిపాడులో కర్రల సాయంతో చెట్లపై వంతెన ఏర్పాటు చేసుకుని వాగులు దాటుతున్నారు గిరిజనులు. నిత్యావసరాల కోసం ప్రాణాలను తెగించారు గిరిపుత్రులు. ప్రభుత్వం స్పందించి వంతెన నిర్మించాలని వేడుకుంటున్నారు గిరిజనులు.

Also Read:TTD:ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష

- Advertisement -