మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు జూన్ 20న ఓ పండంటి ఆడబిడ్డకు పుట్టిన విషయం తెలిసిందే. అయితే, ఈరోజు మెగా ప్రిన్సెస్‌కు బారసాల వేడుక ఘనంగా జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమం ఎక్కడ జరగనుంది. ఎవరెవరు హాజరుకాబోతున్న అనేది కూడా తెలియాల్సి ఉంది. అలాగే ఈ రోజు మెగా ప్రిన్సెస్ పేరును కూడా ఖరారు చేయనున్నారు. మరోవైపు పాప పుట్టిన సందర్భంగా ఫ్యాన్స్, సెలెబ్రిటీల నుంచి చరణ్ దంపతులకు శుభాకాంక్షలు, గిఫ్ట్‌లు అందుతున్నాయి.
తాజాగా ప్రపంచ కుభేరుల్లో ఒకరైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మెగా ప్రిన్సెస్‌కు బంగారు ఊయల గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలుస్తుంది. ఆ ఊయలను 2 కేజీలకు పైగా బంగారంతో తయారు చేయించారని, దానికి రూ.1.20 కోట్ల ఖర్చు చేశారని టాక్ నడుస్తోంది. నిజానికి ముఖేష్ అంబానీ ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి మధ్య గొప్ప అనుబంధం కూడా ఏమీ లేదు. అయినప్పటికీ ముఖేష్ అంబానీ మెగా ప్రిన్సెస్ కోసం ఇలా ప్రత్యేకమైన గిఫ్ట్ పంపడం విశేషం.
Also Read: 7:11PM ట్రైలర్ లాంఛ్ బై హరీష్
అన్నట్టు చరణ్ మెగా ప్రిన్సెస్ ను ఎత్తుకున్న ఫొటోలు తెగ వైరల్ అయ్యాయి. ఆ ఫొటోలో రామ్ చరణ్ ధరించిన వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే, ఆ వాచ్ రిచర్డ్ మిల్లే బ్రాండ్‌కు చెందినది అని.. దాని ఖరీదు దాదాపు రూ.1.62 కోట్లు ఉంటుందని సినిమా విశ్లేషకుడు మనోబాల విజయబాలన్ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ వాచ్ ను చిరు చరణ్ కి గిఫ్ట్ గా ఇచ్చాడట. తనకు మనవరాలు పుట్టిన సందర్భంగా చిరు ఈ వాచ్ ను ఇచ్చినట్లు తెలుస్తోంది.
Also Read: జేపీ ప్రొడక్షన్‌లో కొత్త సినిమా…