వరుసగా బ్యాంకులకు సెలవులు రానున్నాయి. సెప్టెంబర్ 30.. దుర్గా పూజ, నవరాత్రి ఎనిమిదవ రోజును పురస్కరించుకుని, మహా అష్టమి/దుర్గా అష్టమి సందర్భంగా అగర్తల, భువనేశ్వర్, గౌహతి, ఇంఫాల్, జైపూర్, కోల్‌కతా, పాట్నా, రాంచీతో సహా పలు నగరాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి.
అక్టోబర్ 1న త్రిపుర, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, సిక్కిం, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, నాగాలాండ్, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, మేఘాలయ, కేరళతో సహా అనేక రాష్ట్రాల్లో దసరా, ఆయుధ పూజ, దుర్గా పూజల కారణంగా బ్యాంకులకు సెలవు.
Also Read:హైలెస్సో..గ్రాండ్ లాంచ్!
అక్టోబరు 2న మహాత్మా గాంధీ జయంతి, దసరా, విజయ దశమి, దుర్గాపూజ కారణంగా భారతదేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు ఉండనుంది. అక్టోబర్ 3-4న దుర్గా పూజ (దసైన్) వేడుకల కారణంగా సిక్కింలో బ్యాంకులకు హాలిడే.
అక్టోబర్ 5న ఆదివారం.. దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.అయితే బ్యాంకులకు సెలవు అయిన నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ యాప్స్, ఏటీఎం విత్‌డ్రా వంటి ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి.

