బ్యాంకుల సమ్మె లేదు…

534
banks strike postpone
- Advertisement -

సెప్టెంబర్‌లో బ్యాంకుల సమ్మె నేపథ్యంలో నాలుగు రోజులు వరుసగా సెలవులు రానున్నాయనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 26, 27 తేదీల్లో సమ్మెకు దిగుతామని యూఎఫ్‌బీయూ పేర్కొంది. తర్వాత సెప్టెంబర్ 28 నాలుగో శనివారం,29 ఆదివారం కావడంతో పండుగపూట నాలుగు రోజులు బ్యాంకులు పనిచేయక పైసలు దొరకక ఇబ్బందుల తప్పవని ప్రచారం జరిగింది.

అయితే సెప్టెంబర్ 26,27 తేదీల్లో బ్యాంకు అధికారులు సమ్మె చేయడం లేదు. దీంతో బ్యాంకులు యధావిధిగా పనిచేయనున్నాయి. 28 నాలుగవ శనివారం,29 ఆదివారం సెలవు. సెప్టెంబర్ 30,అక్టోబర్ 1న బ్యాంకులు యథావిధిగా పనిచేయనున్నాయి. అక్టోబర్ 2న గాంధీ జయంతి బ్యాంకులకు సెలవు.

- Advertisement -