బ్యాంక్ సేవలన్నీ ఇకపై వాట్సాప్ లోనే..?

50
- Advertisement -

స్మార్ట్ అరచేతిలోకి వచ్చిన తరువాత ప్రతిదీ కూడా సులభతరం అయింది. ఎలాంటి సమాచారం అయిన కూడా ఒక్క స్మార్ట్ ఫోన్ ఉపయోగించి సులభంగా తెలుసుకుంటున్నాము. ఇక మొబైల్ ఉపయోగించి ఉన్న చోటికే మనకు కావలసినవి తెప్పించుకుంటున్నాము. ఒకప్పుడు డబ్బు కావాలంటే తప్పనిసరిగా బ్యాంక్ కు మాత్రమే వెళ్లాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు అలా కాదు. మొబైల్ ఉపయోగించి చేతిలో నగదు లేకుండానే మనకు కావలసినవి తెచ్చుకుంటున్నాము. పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా బ్యాంకులు సరికొత్త విధానాలను ప్రవేశ పెడుతూ వారి కష్టమర్లకు ఎన్నో సేవలను సులభతరం చేస్తున్నాయి. .

ముఖ్యంగా ఆ విషయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందు వరుసలోనే ఉందని చెప్పవచ్చు. తాజాగా ఎస్బీఐ కష్టమర్లకు ఆ బ్యాంక్ సరికొత్త విధానాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. బ్యాంక్ లావాదేవీలకు సంబంధించిన అన్నీ రకాల సమాచారాన్ని వాట్సప్ ద్వారా అందించే వీలు కల్పించింది. ప్రస్తుతం మొబైల్ ఫోన్ ఉందంటే వాట్సప్ కచ్చితంగా ఉండాల్సిందే. అందువల్ల వాట్సప్ ఉపయోగించి బ్యాంక్ లావాదేవీలను క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు.

Also Read:కూరగాయలను పచ్చిగా తింటే ప్రమాదమా?

అందుకోసం ఏం చేయాలంటే.. ముందుగా 7208933148 అనే నెంబర్ కు WAREG అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి మీ బ్యాంక్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ తో ఎస్‌ఎం‌ఎస్ చేయాలి. రిజిస్టర్ అయిన తరువాత 9022690226 అనే నెంబర్ ను మొబైల్ లో సేవ్ చేసుకొని వాట్సప్ లో ఆ నెంబర్ కు హాయ్ అని మెసేజ్ చేయాలి అంతే వెంటనే.. చెక్ బ్యాలెన్స్, మినీ స్టేట్మెంట్, అకౌంట్ స్టేట్మెంట్, పెన్షన్ స్లిప్, లోన్ డీటైల్స్, డిపాజిట్ డీటైల్స్, ఇన్ స్టా సేవింగ్ అకౌంట్, ఎన్ఆర్ఐ సర్వీస్, ఫ్రీ అప్రూడ్ లోన్స్ వంటి పలు రకాల ఆప్షన్లతో చాట్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మనకు ఏది అవసరమో దానిని ఎంచుకొని బ్యాంక్ సేవలను వాట్సప్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు.

Also Read:పెళ్లి రోజు..గ్రీన్‌ ఛాలెంజ్

- Advertisement -